US Shocker: ChatGPTను ఉపయోగించి తల్లిని, తమ్ముడిని చంపిన యువకుడు.. అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి.. నిందితుడు అరెస్ట్..

అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఘోర దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల భారత సంతతికి చెందిన విద్యార్థి తన స్వంత తల్లిని, 14 ఏళ్ల తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఆక్టన్ నివాసి అయిన అర్జున్ అరవింద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

crime-scene (Rep Image)

అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఘోర దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల భారత సంతతికి చెందిన విద్యార్థి తన స్వంత తల్లిని, 14 ఏళ్ల తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఆక్టన్ నివాసి అయిన అర్జున్ అరవింద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోస్టన్‌కు సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆక్టన్‌లోని మార్తా లేన్‌లో గల ఈ కుటుంబం ఇంట్లో మంగళవారం ఈ ఘటన జరిగింది.

మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఒక ట్యూటర్ విద్యార్థులకు బోధించడానికి వారింటికి వచ్చింది.ఇంట్లోకి ప్రవేశించే వీలు లేకపోవడంతో ఆమె అర్జున్ తండ్రికి ఫోన్ చేసింది. ఆయన తన భార్య, పిల్లలకు సమాచారం అందించేందుకు ప్రయత్నించి విఫలమవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా, 45 ఏళ్ల సుధా వెంకటేశన్ మృతదేహం ఇంటి నేలమాళిగలో (Basement), ఆమె 14 ఏళ్ల చిన్న కుమారుడు సిద్ధార్థ్ అరవింద్ మృతదేహం మొదటి అంతస్తులో రక్తపు మడుగులో కనిపించాయి.

షాకింగ్ వీడియో ఇదిగో.. బుర్ఖా వేసుకున్న మహిళపై దారుణం.. అక్కడ గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించిన కామాంధుడు, నిందితుడు అరెస్ట్..

ఇద్దరి శరీరాలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు మిడిల్‌సెక్స్ జిల్లా అటార్నీ మరియన్ ర్యాన్ మరియు ఆక్టన్ పోలీస్ చీఫ్ డగ్లస్ స్టర్నియోలో తెలిపారు. మరణానికి గల కచ్చితమైన కారణాలు, ఉపయోగించిన ఆయుధ వివరాలు తెలియాల్సి ఉందన్నారు. నేరం చేసిన అనంతరం అర్జున్ అరవింద్, తన తల్లికి చెందిన 'హోండా అకార్డ్' కారులో అక్కడి నుండి పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు నాన్‌స్టాప్‌గా గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున మసాచుసెట్స్‌లోని వేలాండ్‌లో ఒక పార్కింగ్ స్థలంలో ఉన్న కారును పోలీసులు గుర్తించి, అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Using ChatGPT, Indian-Origin Teen Allegedly Kills Mother and Brother in US

పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడికి సంబంధించిన దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర్జున్ కొద్దిరోజులుగా ఇంటర్నెట్, ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT) వేదికగా తన సొంత కుటుంబాన్ని ఎలా చంపాలి? అనే విషయాలపై సైద్ధాంతిక ఆలోచనలు, కల్పిత కథనాల కోసం శోధించినట్లు మిడిల్‌సెక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపింది. గోతిక్ నవలల తరహా దారుణమైన కథలను రూపొందించమని అతను చాట్‌బాట్‌ను కోరినట్లు అధికారులు స్పష్టం చేశారు.

యాక్టన్-బాక్స్‌బరో రీజినల్ హైస్కూల్ విద్యార్థి అయిన అర్జున్ అరవింద్‌పై రెండు హత్య కేసులు, కుటుంబ సభ్యులపై దాడులు, మోటారు వాహనం దొంగతనం సహా పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హత్య అభియోగాల తీవ్రత దృష్ట్యా అతడిని కాంకర్డ్ డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరుపరచనున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement