GST Collections: రికార్డులతో దూసుకుపోతున్న జీఎస్టీ వసూళ్లు.. వరుసగా మూడో నెల రూ.2 లక్షల కోట్లు పైమాటే. నికర ఆదాయం రూ.1.77 లక్షల కోట్లు..
దేశంలో జీఎస్టీ (GST) వసూళ్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జూలై, ఆగస్టు నెలల బాటలోనే సెప్టెంబర్ నెలలో కూడా స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటాయి. సెప్టెంబర్‌లో వార్షికంగా 14.7 శాతం వృద్ధితో మొత్తం రూ.2,03,521 కోట్ల వసూళ్లు నమోదైనట్లు ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
GST Collections: దేశంలో జీఎస్టీ (GST) వసూళ్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జూలై, ఆగస్టు నెలల బాటలోనే సెప్టెంబర్ నెలలో కూడా స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటాయి. సెప్టెంబర్‌లో వార్షికంగా 14.7 శాతం వృద్ధితో మొత్తం రూ.2,03,521 కోట్ల వసూళ్లు నమోదైనట్లు ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ఇదే సెప్టెంబర్ నెలలో నమోదైన రూ.1,77,173 కోట్లతో పోలిస్తే ఈసారి ఆదాయంలో గణనీయమైన ఎదుగుదల కనిపించింది. . PIN, OTP లేకుండానే Apple Pay పేమెంట్.. ఏ ఫోన్లు సపోర్ట్ చేస్తాయి.. భారత్‌లో ఎలా పనిచేస్తుందంటే?
విభాగాల వారీగా వసూళ్ల వివరాలు:
కేంద్ర జీఎస్టీ (CGST): రూ. 37,762 కోట్లు
రాష్ట్ర జీఎస్టీ (SGST): రూ. 45,363 కోట్లు
ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST): రూ. 1,20,396 కోట్లు
వ్యాపారాల నుంచి దేశీయంగా వచ్చిన జీఎస్టీ రాబడి 10.1 శాతం వృద్ధితో రూ.1,37,996 కోట్లకు చేరగా, దిగుమతులపై జీఎస్టీ రాబడి పెరగడం మొత్తం వసూళ్ల రికార్డు వృద్ధికి ప్రధాన కారణమైంది. వివిధ రిఫండ్లు, సెటిల్‌మెంట్ల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద మిగిలిన నికర జీఎస్టీ రాబడి (Net GST Revenue) 18.1 శాతం పెరిగి రూ.1,76,520 కోట్లకు చేరింది.
తొలి ఆరు నెలల్లో రూ.12.46 లక్షల కోట్లు:
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గల తొలి ఆరు నెలల్లో దేశంలో సేకరించిన స్థూల జీఎస్టీ వసూళ్లు ఏకంగా రూ.12,46,278 కోట్లకు చేరాయి. ఇది గతేడాది తొలి ఆరు నెలల వసూళ్లతో పోలిస్తే 11.6 శాతంతో బలమైన వృద్ధిని సూచిస్తోంది.
అక్టోబర్ 7న జీఎస్టీ కౌన్సిల్ భేటీ:
త్వరలో (అక్టోబర్ 7న) జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లను పెద్దగా మార్చే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనికి బదులుగా 'జీఎస్టీ 2.0' సంస్కరణలలో భాగంగా పన్ను ప్రక్రియల సరళీకరణ, ఈ-ఇన్వాయిసింగ్ నిబంధనలు, ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) ప్రక్రియలపై కౌన్సిల్ ప్రధానంగా దృష్టి సారించనుంది.