Subhash Chandra Debt Case Explained: రూ.22,006 కోట్ల అప్పు మాఫీ కాదు.. NCLT ఆమోదించిన రూ. 6.5 కోట్ల వెనుక అసలు కథ.. సుభాష్ చంద్ర కేసు లెక్కలు ఇవే..
జీ (Zee) గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా వ్యవహారంలో జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునల్ (NCLT) ఢిల్లీ బెంచ్ మంగళవారం ఒక కీలక తీర్పును వెలువరించింది. ఆయన అంగీకరించిన రూ. 22,006 కోట్ల క్లెయిమ్‌లను.. వ్యక్తిగత హామీదారుగా రూ. 6.25 కోట్లు చెల్లించడం ద్వారా పరిష్కరించుకోవడానికి రూపొందించిన రుణ చెల్లింపు ప్రణాళికకు NCLT మూడవ న్యాయ సభ్యుడు నిలేష్ శర్మ ఆమోదం తెలిపారు.
Subhash Chandra Debt Case Explained: జీ (Zee) గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా వ్యవహారంలో జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునల్ (NCLT) ఢిల్లీ బెంచ్ మంగళవారం ఒక కీలక తీర్పును వెలువరించింది. ఆయన అంగీకరించిన రూ. 22,006 కోట్ల క్లెయిమ్‌లను.. వ్యక్తిగత హామీదారుగా రూ. 6.25 కోట్లు చెల్లించడం ద్వారా పరిష్కరించుకోవడానికి రూపొందించిన రుణ చెల్లింపు ప్రణాళికకు NCLT మూడవ న్యాయ సభ్యుడు నిలేష్ శర్మ ఆమోదం తెలిపారు.
సుభాష్ చంద్రపై ఉన్న వ్యక్తిగత దివాలా కేసు ఏంటి..
ఎస్సెల్/జీ గ్రూప్ (Essel Group) పరిధిలోని పలు కంపెనీలు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నాయి. ఆ కంపెనీలు రుణం తీసుకునే సమయంలో సుభాష్ చంద్ర తన వ్యక్తిగత పేరు మీద 'గారంటర్' (Personal Guarantor) గా సంతకం చేశారు. సదరు కంపెనీలు ఆ రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమవ్వడంతో (Default), అప్పు ఇచ్చిన సంస్థలు (ఉదాహరణకు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ / సమ్మాన్ క్యాపిటల్) ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (IBC) కింద గారంటర్‌గా ఉన్న సుభాష్ చంద్రపై వ్యక్తిగత దివాలా ప్రక్రియను ప్రారంభించాయి.
EPFO 3.0 కొత్త నిబంధనలు.. ATM, UPI ద్వారా PF విత్‌డ్రా ఎప్పటి నుంచి? ఎంత తీసుకోవచ్చు?
ఈ ప్రక్రియలో సుభాష్ చంద్ర హామీ ఇచ్చిన రుణాలకు సంబంధించి ఆమోదించబడిన మొత్తం క్లెయిమ్‌ల విలువ రూ. 22,006 కోట్లు. చంద్ర తన వ్యక్తిగత ఆస్తుల ద్వారా కేవలం రూ. 6.25 కోట్లు మాత్రమే చెల్లించి ఈ కేసు నుంచి విముక్తి (Settlement) పొందేందుకు ఒక రుణ చెల్లింపు ప్రణాళికను (Repayment Plan) సిద్ధం చేశారు. బ్యాంకులు రూ. 22,000 కోట్లకు గాను కేవలం రూ. 6.25 కోట్లు మాత్రమే తీర్చుకోవడానికి అంగీకరిస్తే.. అది దాదాపు 99.97% రుణ మాఫీ (Haircut) కిందకు వస్తుందని, ఇది తమకు తీవ్ర నష్టమని HDFC బ్యాంక్, LIC హౌసింగ్ ఫైనాన్స్ వంటి సంస్థలు NCLT లో నిరసన తెలిపాయి.
NCLT (ట్రిబ్యునల్) ఏమని తీర్పు ఇచ్చింది?
80.8% ఓటింగ్ వాటా ఉన్న మెజారిటీ రుణదాతలు ఈ ప్రణాళికకు మద్దతు తెలపడంతో, NCLT ఢిల్లీ బెంచ్ ఈ రూ. 6.25 కోట్ల సెటిల్‌మెంట్ ప్రణాళికను ఆమోదించింది. చంద్ర ప్రస్తుత వ్యక్తిగత నికర ఆస్తి విలువ చాలా తక్కువగా ఉందని, అతడిని పూర్తిగా దివాలా తీసినట్లు ప్రకటిస్తే బ్యాంకులు ఈ మాత్రం డబ్బును కూడా వసూలు చేసుకోలేవనే కోణంలో ట్రిబ్యునల్ ఈ ఆమోదం తెలిపింది.
రూ. 22,000 కోట్లు చంద్ర సొంతంగా వాడుకున్న అప్పు కాదని, ఆయన కేవలం గారంటర్ మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు, చంద్ర కార్యాలయం స్పష్టం చేశాయి.చంద్ర వ్యక్తిగతంగా రూ. 6.25 కోట్లు చెల్లించినప్పటికీ, అసలు రుణం తీసుకున్న ప్రధాన కంపెనీల నుంచి మిగిలిన బకాయిలు మరియు ఆస్తులను వసూలు చేసుకునే హక్కు బ్యాంకులకు ఇంకా ఉంటుంది.
ఆ రూ. 22,006 కోట్ల మొత్తం చంద్ర వ్యక్తిగతంగా తీసుకున్న రుణం కాదు. అందులో రూ. 2,574 కోట్లు మాత్రమే మొదట ఇచ్చిన హామీలకు సంబంధించినవి కాగా, మిగిలినవి అదనపు భద్రతగా ఇచ్చినవి. ఈ వ్యక్తిగత పరిహారంతో సంబంధం లేకుండా ప్రధాన కార్పొరేట్ రుణగ్రహీత కంపెనీల నుంచి బకాయిలు, సెక్యూరిటీలు, ఆస్తులను వసూలు చేసుకునే హక్కు రుణదాతలకు ఉంటుందని NCLT తెలిపింది.
LICHFL, HDFC బ్యాంక్‌లు ఈ ప్రణాళికను "ఆచరణ సాధ్యం కానిది, చట్టవిరుద్ధమైనదని అభివర్ణించాయి. 2017లో చంద్ర నికర ఆస్తి విలువ రూ. 45,888 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం రూ. 31.79 కోట్లుగా చూపించడంపై రుణదాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT)ను ఆశ్రయించడానికి LICHFL, HDFC బ్యాంక్‌లు సిద్ధమవుతున్నాయి.
సుభాష్ చంద్ర ప్రతిస్పందన:
తాను ఏ రుణదాత నుంచీ వ్యక్తిగతంగా అప్పు తీసుకోలేదని సుభాష్ చంద్ర స్పష్టం చేశారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న వారు చెప్తున్న క్లెయిమ్ రూ. 22,000 కోట్లు కాదని, కేవలం రూ. 3,992 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. తాను హామీ ఇచ్చిన సంస్థలు ఇప్పటివరకు రుణదాతలకు రూ. 43,000 కోట్లు తిరిగి చెల్లించాయని, మిగిలిన బకాయిలను కూడా ఆయా కంపెనీలే చెల్లిస్తాయని వివరించారు. ఈ కేసు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత-హామీదారు కేసు మాత్రమేనని.. IBC కింద సాధారణ కార్పొరేట్ దివాలా రికవరీలకు ఇది ప్రాతినిధ్యం వహించదని నిపుణులు తెలిపారు. ఈ కేసు మళ్లీ NCLT డివిజన్ బెంచ్‌కు వెళ్లి అధికారిక ఉత్తర్వుగా జారీ కానుంది.
క్లుప్తంగా చెప్పాలంటే.. కంపెనీలు తీసుకున్న భారీ రుణాలకు గారంటర్‌గా ఉన్న వ్యక్తి నుంచి ఎంతవరకు వసూలు చేయవచ్చు అనే ప్రశ్నకు సంబంధించి ఎన్‌సిఎల్టి ఇచ్చిన కీలకమైన మరియు వివాదాస్పదమైన తీర్పు ఇది. LICHFL, HDFC బ్యాంకులు ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT)కు వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి.