RBI Repo Rate Hike: ద్రవ్యోల్బణం పెరుగుదల వేళ RBI కీలక నిర్ణయం.. రెపో రేటు 5.5 శాతానికి పెంపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్కెట్ అంచనాలకు అనుగుణంగా కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.25 శాతం నుంచి 5.50 శాతానికి చేర్చింది. ఫిబ్రవరి 2023 తర్వాత కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎమ్‌పిసి) ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.

RBI Governor Sanjay Malhotra (Photo-ANI)

RBI Repo Rate Hike: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్కెట్ అంచనాలకు అనుగుణంగా కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.25 శాతం నుంచి 5.50 శాతానికి చేర్చింది. ఫిబ్రవరి 2023 తర్వాత కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎమ్‌పిసి) ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో క్రమంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ఆయిల్ ధరలు , రూపాయి విలువలో క్షీణత వంటి అంశాలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.   8వ పే కమిషన్ లేట్ అయితే కేంద్ర ఉద్యోగులకు భారీ నష్టం.. Level 7 ఉద్యోగులు రూ.3 లక్షలకు పైగా నష్టపోయే అవకాశం..

ఈ రేట్ల పెంపు ప్రభావం వల్ల బ్యాంకుల రుణ సేకరణ వ్యయం పెరిగి, సాధారణ పౌరులు తీసుకునే గృహ, వాహన, వ్యక్తిగత , వ్యాపార రుణాలపై వడ్డీ భారం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని నియంత్రించి, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశం. దీనికి తోడు 2018 తర్వాత తొలిసారిగా ఆర్‌బీఐ తన ద్రవ్య విధాన వైఖరిని 'తటస్థ విధానం' నుంచి ‘క్రమబద్ధమైన కఠినతరం’ (Calibrated Tightening) వైపు మార్చింది. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం మరింత పెరిగితే మరిన్ని కఠిన చర్యలకు వెనుకాడబోమని, సమీప కాలంలో కోతలకు అవకాశం లేదని ఆర్‌బీఐ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్ యుద్ధ వాతావరణం, సరఫరా గొలుసుల్లో అంతరాయాలు , ప్రపంచ వాణిజ్య అనిశ్చితులపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, దేశీయంగా తయారీ , సేవల రంగాలు స్థిరమైన ప్రదర్శన కనబరుస్తుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వాస్తవ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.7 శాతం నుంచి 7.1 శాతానికి పెంచింది. అదే సమయంలో, కోర్ ద్రవ్యోల్బణ అంచనాను 4.3 శాతం నుంచి 4.4 శాతానికి సవరించింది. వృద్ధి అంచనాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, పెరిగిన వడ్డీ రేట్లు పరిశ్రమల పెట్టుబడులపై అదనపు భారం మోపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement