Arrangements of Love: అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ లవ్ ద్వారా హాలీవుడ్ లోకి సమంత, సినిమాలో బై సెక్సువల్ అమ్మాయిగా కనిపించనున్న బ్యూటీ, ఇష్టమైన దర్శకుడితో నటించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్

సమంత హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. పెళ్లి..విడాకుల తర్వాత డిసెంట్‌ రోల్స్‌ సెలక్ట్‌ చేసుకున్న సామ్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ తర్వాత భిన్నమైన కథలో నటించబోతోంది.అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ (Arrangements of Love) అనే చిత్రంతో హాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

Samantha Ruth Prabhu (Photo-Instagram/Samantha)

సమంత హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. పెళ్లి..విడాకుల తర్వాత డిసెంట్‌ రోల్స్‌ సెలక్ట్‌ చేసుకున్న సామ్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ తర్వాత భిన్నమైన కథలో నటించబోతోంది.అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ (Arrangements of Love) అనే చిత్రంతో హాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఫిలిప్ జాన్ దర్శకత్వంలో భారతీయ రచయిత ఎన్‌ మురారి రాసిన ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా రూపొందనున్న చిత్రంలో సమంత (Samantha Ruth Prabhu) లీడ్ రోల్ చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది.

ఇందులో బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా సమంత కనిపించబోతోంది. అంటే కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీల ఆకర్షణకు కూడా లోనయ్యే యువతి పాత్ర ఇది. అంతేగాక ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో (first international project ) తీస్తున్నారు. తమిళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్ లాంటి భాషల్లో కూడా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల శాకుంతలం మూవీని పూర్తి చేసుకున్న సమంత తమిళలో​ కాతువాకుల రెండు కాదల్‌లో నటిస్తోంది.

జననీ.. ప్రియ భారత జననీ.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకి ఆత్మలాంటి పాటను విడుదల చేసిన టీం, పాట కోసం రెండు నెలలు శ్రమించిన మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి

దీనితో పాటు డ్రీమ్‌ వారియర్‌ బ్యానర్లో ఓ ద్విభాసా చిత్రంతో పాటు శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌లో శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మాణంలో సమంత మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాటు పుష్పలో ఐటెం సాంగ్‌ చేయడానికి కూడా ఒప్పుకుంది.

Here's Samantha Tweet

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లో..‘2009లో ‘ఏ మాయ చేశావే’ సినిమాకి మొదటిసారి ఆడియన్స్ ఇచ్చాను. 12 సంవత్సరాల తర్వాత ఈ సినిమా కోసం ఇస్తూ అప్పుడు ఎలా నెర్వస్‌గా ఫీల్ అయ్యానో.. ఇప్పుడు అలాగే అనిపించింది. నాకు ఎంతో ఇష్టమైన సిరీస్ ‘డౌన్‌టౌన్ అబ్బే’ దర్శకుడైన ఫిలిప్ నటించనుండడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ కొత్త జర్నీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాన‌’ని రాసుకొచ్చింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Advertisement
Advertisement
Share Now
Advertisement