Balakrishna,Koratala Siva : బాలయ్య, కొరటాల శివ కాంబినేషన్‌లో కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్, అదిరిపోయే టైటిల్

లాక్ డౌన్ సమయంలో కొరటాల శివ, బాలకృష్ణ కోసం ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేశారట. ఈ కథ బాలకృష్ణ మాత్రమే చేయగలరు అనేలా ఉంటుందట. ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్టు ఉండొచ్చని అంటున్నారు.

(Image: Twitter )

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ, తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ లో పనిచేసేందుకు సిద్ధం అవుతున్నటలు తెలుస్తోంది. ఇప్పటికే అఖండ, సినిమా పూర్తి చేసుకొని, దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న బాలయ్య, మరో సినిమా కూడా లైన్లో పెట్టినట్లు సమాచారం అందుతోంది. మరి కొత్త సినిమా కాంబినేషన్ విషయానికి వస్తే ఓ ప్రత్యేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఫ్లాప్ చూడని దర్శకుడు కొరటాల శివతో బాలకృష్ణ జతకట్టనున్నాడనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రభాస్, మహేశ్, ఎన్టీఆర్ లకు భారీ హిట్లు ముట్టజెప్పిన ఆయన, ఆ తరువాత సినిమాగా చిరంజీవితో 'ఆచార్య' సినిమా చేశారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

'ఆచార్య' సినిమా ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కానుంది. ఆ తరువాత సినిమాను ఆయన ఎన్టీఆర్ తో చేయనున్నారు. 'జనతా గ్యారేజ్' తరువాత ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మరో సినిమా ఇది. ఈ సినిమా తరువాత బాలకృష్ణతో ఒక సినిమా చేసే ఆలోచనలో కొరటాల ఉన్నారనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

లాక్ డౌన్ సమయంలో ఆయన బాలకృష్ణ కోసం ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేశారట. ఈ కథ బాలకృష్ణ మాత్రమే చేయగలరు అనేలా ఉంటుందట. ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్టు ఉండొచ్చని అంటున్నారు. అయితే ఈ కథను బాలకృష్ణకి వినిపించారని, అందుకు ఆయన కూడా ఓకే చెప్పినట్లు సమాచారం, అయితే ఈ సినిమాకు మోనార్క్‌ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement