Padma Awards 2025

New Delhi, JAN 25: కేంద్రం ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను (Padma Awards) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సారి మొత్తం 139 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్‌, 19 మందికి పద్మభూషణ్‌, 113 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.

Republic Day Wishes In Telugu: రిపబ్లిక్ డే విషెస్ మీ బంధుమిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలియజేయండి.. Whatsapp, Twitter, Facebook ద్వారా ఈ విషెస్ షేర్ చేసుకోవచ్చు..  

తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మ అవార్డులు వరించాయి. దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి (Duvvuri Nageshwar Reddy) (వైద్యరంగం) పద్మభూషణ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. మంద కృష్ణ మాదిగ (ప్రజావ్యవహారాలు) (Manda Krishna) పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.

Padma Awards 2025 Full List

 

ఏపీ నుంచి ఐదుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. కళల విభాగంలో హీరో నందమూరి బాలకృష్ణకు (Nandamuri Balakrishna) పద్మభూషణ్‌ అవార్డును కేంద్రం ప్రకటించింది. అలాగే, కేజీఎఫ్‌ నటుడు ఆనంత్‌నాగ్‌కు పద్మభూషణ్‌, ప్రముఖ తమిళ హీరో అజిత్‌కుమార్‌కు (Ajith Kumar) పద్మభూషణ్‌, ప్రముఖ సినీ నటి, నృత్యకళాకారిణి శోభనకు (Shobhana) పద్మభూషణ్‌ అవార్డులను ప్రకటించింది. కేఎల్‌ కృష్ణ (సాహిత్యం-విద్యారంగం), మాడుగుల నాగఫణి శర్మ (కళలు), మిర్యాల అప్పారావు (కళలు-మరణానంతరం), వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం-విద్యారంగం‌)కు పద్యశ్రీ అవార్డులు వరించాయి.