Nara Lokesh, Balakrishna, Laxmi Parvathi pays tributes to NTR

Hyd, Jan 18:  సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు ఏపీ మంత్రి నారా లోకేష్, బాలకృష్ణ, లక్ష్మి పార్వతి. నందమూరి తారక రామారావు వల్లే ఈరోజు తెలుగు వాళ్లు తలెత్తుకొని తిరుగుతున్నారు అన్నారు నారా లోకేష్.

ఎన్టీఆర్ అంటే కేవలం మూడక్షరాల పేరు కాదు, ఎన్టీఆర్ అంటే ప్రభంజనం అని కొనియాడారు. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో ఆయన నెంబర్ వన్ గా నిలిచారు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అనేక గొప్ప సంస్కరణలు తెచ్చారు అని గుర్తుచేశారు లోకేష్.

ఎన్టీఆర్ ఒక ప్రభంజనం అన్నారు నందమూరి బాలకృష్ణ. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారు అని...సినిమా రంగంలోనైనా, రాజకీయాల్లో నైనా ఆయనను అభిమానులు, కార్యకర్తలు దేవుడిలా కొలిచే వారు అన్నారు. తెలుగు వాళ్లంతా నందమూరి తారక రామారావు కుటుంబమే... ఇప్పటికీ అనేక ప్రభుత్వాలు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నాయి అన్నారు.  నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్ (వీడియో) 

నా భర్త ఎలా చనిపోయారో, ఎన్ని కుతంత్రాలు జరిగాయో నాకు తెలుసు అన్నారు లక్ష్మి పార్వతి. గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ వస్తున్నాను...ఇప్పటికీ ఆ దుర్మార్గుల అరాచకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి అన్నారు. నేను చేసిన తప్పు ఏంటో ఇప్పటికీ నాకు తెలియదు... అందరి సమక్షంలోనే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నారు అన్నారు. ఏ రోజు ఏ పదవి ఆశించకుండా నిస్వార్ధంగా పని చేశాను... అయినా అవే అబద్ధాలు ఆడుతూ నా జీవితాన్ని ఇంకా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు అన్నారు.