Bimbisara First Look: ఇదివరకెన్నడూ చూడని అవతారంలో కళ్యాణ్ రామ్.. బార్బేరియన్ కింగ్ 'బింబిసారా' ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల

ఫస్ట్ లుక్ లో కళ్యాణ్ రామ్‌ ఇదివరకు ఎప్పుడు చూడని ఒక విభిన్న అవతారంలో కనిపిస్తున్నారు. అనాగరికమైన రాజు పాత్రలో శవాలదిబ్బపై ఠీవీగా కూర్చున్న కళ్యాణ్ రామ్ మోషన్ ను పోస్టర్ చూస్తే మళ్లీ యుగాల క్రితం నాటి వెనక్కి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది....

BIMBISĀRA - #NKR18 Title Reveal | Photo: NTR Arts

ఈరోజు దివంగత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నందమూరి కళ్యాణ్ రామ్ యొక్క 18వ చిత్రం టైటిల్ మరియు మోషన్ పోస్టర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఎన్‌టిఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో హరి కృష్ణ కె నిర్మించిన ఈ చిత్రానికి 'బింబిసారా' అని టైటిల్ ఖరారు చేశారు, 'ఎ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే ట్యాగ్‌లైన్‌.

మగధ సామ్రాజ్యపు వీరుడు, తిరుగులేని యోధుడు బార్బేరియన్ రాజు 'బింబిసారుడు' కథ ఆధారంగా ఒక సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మల్లిడి వశిస్ట్ 'బింబిసారా'కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో కళ్యాణ్ రామ్‌ ఇదివరకు ఎప్పుడు చూడని ఒక విభిన్న అవతారంలో కనిపిస్తున్నారు. అనాగరికమైన రాజు పాత్రలో శవాలదిబ్బపై ఠీవీగా కూర్చున్న కళ్యాణ్ రామ్ మోషన్ ను పోస్టర్ చూస్తే మళ్లీ యుగాల క్రితం నాటి వెనక్కి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది.

Bimbisara Motion Poster:

కెరీర్ ప్రారంభం నుండే విభిన్న పాత్రలు, విభిన్నమైన కంటెంట్ కోసం ఆరాటపడే కళ్యాణ్ రామ్ ఈసారి పూర్తి విభిన్నమైన పాత్రను ఎంచుకున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ మరియు బ్యాక్ డ్రాప్ అద్భుతంగా ఉంటాయి. సినిమా కోసం వేసిన భారీ సెట్లు, విఎఫ్ఎక్స్ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి. భారీ నిర్మాణ విలువలతో, అత్యంత సాంకేతిక విలువలను ఉపయోగించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సినిమా టీం తెలిపింది. గతేడాది షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా కోవిడ్19 కారణంగా మధ్యలో నిలిచిపోయింది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే ఈ ఏడాది రెండవ భాగంలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని బింబిసారా యూనిట్ తెలిపింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement