
Vjy, Mar 5: ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 11 సీట్లు వచ్చిన వాళ్లకు కూడా ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లడం బెటర్ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం... పవన్ కార్పొరేటర్ కు తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని జగన్ ఇవాళ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.దీనిపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా విమర్శలు (Nadendla Manohar Slams YS Jagan) గుప్పించారు.
వై నాట్ 175 అని ఎగిరిన మనిషి 11కు పడిపోవడంతో మతి భ్రమించి, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా? అని ప్రశ్నించారు. తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని నాదెండ్ల (Tenali MLA Nadendla Manohar) సెటైర్లు వేశారు. ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే తనకు తాను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రజా జీవితంలో ఒక్క రూపాయి అయినా ఇచ్చి దాతగా జగన్ నిలబడ్డారా ? మా అధినేత పవన్ కళ్యాణ్ వేలాదిమందికి ఆర్ధిక సాయం చేశారని అన్నారు.
పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో
నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది యువత కాదా? సూపర్ 6 గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాటకు కట్టుబడి ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయటం జగన్ అలవాటు చేసుకోవాలని సూచించారు. రైతులకు ధాన్యం కొనుగోళ్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయిన వారు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఒక్కరోజైనా జగన్ పనిచేశారా? అని ప్రశ్నించారు.
అధికారంలో ఉండగా వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రిగా ముద్రపడిన వ్యక్తి, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ బెంగుళూరు ఎమ్మెల్యేగా మారాడని ఎద్దేవా చేశారు. జగన్ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని మేం అనలేక కాదు, మాకు సభ్యత ఉందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈయన మాత్రం శాసనసభకు రాడు... తరచుగా బెంగళూరుకు వెళుతుంటాడు. మీరు ఏ విధంగా ప్రజా సమస్యలపై నిలబడతారో చెప్పండి. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు... ఆ నిర్ణయాన్ని మీరు గౌరవించాలి కదా" అంటూ నాదెండ్ల వ్యాఖ్యానించారు.