Baby Won't You Tell Me Song from Saaho: సాహో ప్రపంచంలో ఇక మైమరిచిపోండి. 'బేబీ వోన్ట్ యు టెల్ మి' సాంగ్ విడుదల. ఇంటర్నేషనల్ మ్యూజిక్‌ను తలపిస్తున్న 'సాహో' పాటలు, ఫ్యాన్స్ ఫిదా. ఈ ఆగష్టు 30 నుంచి థియేటర్స్‌లో సాహో యాక్షన్ షురూ!

సాహో మునుపటి ట్రాక్స్‌లో ప్రభాస్ మరియు శ్రద్ధా తమ కెమిస్ట్రీతో అదరగొట్టారు. ఇప్పుడు విడుదల చేసిన "బేబీ వోన్ట్ యు టెల్ మి" లవ్ సాంగ్ కూడా హార్ట్ బీట్స్‌ను పెంచేలా ఉంది....

Baby won't you tell me song unveiled from Saaho. | (Photo Credits : T-Series)

రెండు పార్టీ సాంగ్స్ మరియు ఒక రొమాంటిక్ సాంగ్ విడుదల తరువాత, సాహో సినిమా యూనిట్ ఇప్పుడు "బేబీ వోన్ట్ యు టెల్ మి" అనే మరో లవ్ సాంగ్‌ని విడుదల చేసింది. డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ సుజీత్ ఈ పాటను తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ మరియు తమిళ వెర్షన్స్ లలో కూడా విడుదల చేశారు. సాహో సినిమాకు సంబంధించి ప్రతీది 5 భాషల్లో విడుదలవుతూ ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి.

సాహో మునుపటి ట్రాక్స్‌లో ప్రభాస్ మరియు శ్రద్ధా తమ కెమిస్ట్రీతో అదరగొట్టారు. ఇప్పుడు విడుదల చేసిన "బేబీ వోన్ట్ యు టెల్ మి" లవ్ సాంగ్ కూడా హార్ట్ బీట్స్‌ను పెంచేలా ఉంది.

 

సాహో విడుదలకు నాలుగు రోజుల ముందు, ఈ పాటను విడుదల చేయడం ద్వారా ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలు అలాగే కంటిన్యూ అయ్యేలా సినిమా యూనిట్ చాలా ప్లాన్‌డ్ గా వెళ్తుంది. ఈ పాట విడుదలకు ముందు దీనికి సంబంధించిన పోస్టర్‌ను ప్రభాస్ షేర్ చేస్తూ “సాహో ప్రపంచంలో మైమరచిపోవడానికి సిద్ధంగా ఉండండి!  Baby Won’t You Tell Me - Out Today! # SaahoOnAugust30 #Saaho ”. అంటూ ట్వీట్ చేశారు. ప్రభాస్ చెప్పినట్లుగానే ఈ సాంగ్ కూడా ప్రపంచాన్ని మైమరిచిపోయేలా కూల్‌గా ఉంది.

ప్రభాస్, శ్రద్దా అండర్ కవర్ ఆఫీసర్లుగా మరియు మరెంతో మంది ఇండియన్ స్టార్లు నటిస్తున్న 'సాహో' చిత్రం భారీ అంచనాల నడుమ ఆగష్టు 30న రిలీజ్ కాబోతుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement