Rajasekhar Health Condition: హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించిన జీవిత, తొందరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది, డాక్టర్లు ఆక్సిజ‌న్ సపోర్ట్ తగ్గిస్తూ చికిత్స చేస్తున్నార‌ని తెలిపిన రాజశేఖర్ సతీమణి

సినీనటుడు రాజశేఖర్‌ ఆరోగ్యంపై ఆయన భార్య జీవితా రాజశేఖర్‌ (Jeevitha Rajasekhar) స్పందించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్‌ ఆరోగ్యం (Rajasekhar Health Condition) ముందుకన్నా చాలా మెరుగ్గా ఉంది. వైద్యానికి ఆయన సహకరిస్తున్నారు. మొదట చాలా క్రిటికల్‌ స్టేజి వరకు వెళ్లారు. వైద్యులు, మేము కూడా చాలా భయపడ్డాము. డాక్టర్లు అనుక్షణం ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారు

Jeevitha Responds Over Hero Rajasekhar Health Condition (Photo-Video grab

సినీనటుడు రాజశేఖర్‌ ఆరోగ్యంపై ఆయన భార్య జీవితా రాజశేఖర్‌ (Jeevitha Rajasekhar) స్పందించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్‌ ఆరోగ్యం (Rajasekhar Health Condition) ముందుకన్నా చాలా మెరుగ్గా ఉంది. వైద్యానికి ఆయన సహకరిస్తున్నారు. మొదట చాలా క్రిటికల్‌ స్టేజి వరకు వెళ్లారు. వైద్యులు, మేము కూడా చాలా భయపడ్డాము. డాక్టర్లు అనుక్షణం ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందుతోంది. తొందరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది' అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకున్న అభిమానులందరికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు.

అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గ‌త కొన్నిరోజులుగా న‌గ‌రంలోని సిటీ న్యూరో సెంట‌ర్‌లో చికిత్స పొందుతున్నారు. తొలిరోజు నుంచి ఆయ‌న‌కు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారు. ఆయ‌న వెంటిలేట‌ర్‌పై ఉన్నాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీంతో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్య ప‌రిస్థితిపై జీవిత‌ స్పందించారు.

రాజ‌శేఖ‌ర్‌ ఎప్పుడూ వెంటిలేటర్‌పై లేర‌ని, నిజానికి ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించింద‌ని వెల్ల‌డించారు. అయిన‌ప్ప‌టికీ వెంటిలేటర్ మీద మాత్రం లేర‌ని, నాన్ ఇన్‌వాసివ్ వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందించార‌ని చెప్పారు. ఇప్పుడు క్ర‌మంగా ఆక్సిజ‌న్ సపోర్ట్ తగ్గిస్తూ చికిత్స చేస్తున్నార‌ని తెలిపారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు, సహనటులు, అభిమానులు చేసిన ప్రార్థనలు కారణంగానే రాజశేఖర్ క్షేమంగా ఉన్నారని జీవిత పేర్కొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement