Kalki 2898 AD: అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో దుమ్ము రేపిన కల్కి 2898 ఏడీ, ఏకంగా 13.5 లక్షలకు పైగా టికెట్స్‌ అమ్మకం, విడుదలకు ముందే రూ. 200 కోట్లు క్రాస్

కల్కి (Kalki 2898 AD) మరికొన్ని గంటల్లో విడుదల కానున్న నేపథ్యంలో విడుదలకు ముందే కలక్షన్లలో దుమ్ము రేపింది. నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డులు తిరగరాసింది. 2024లో విడుదలైన చిత్రాల్లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌ ద్వారా 10లక్షల టికెట్స్‌ అమ్ముడైన తొలి భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది.

Theme of Kalki

ఇప్పటికే నార్త్‌లో దీని అడ్వాన్స్ బుకింగ్స్‌ ప్రభాస్‌ గత సినిమా ‘సలార్‌’ (Salaar) రికార్డులను బ్రేక్‌ చేశాయి. ఇప్పటి వరకు కల్కి ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో మొత్తం 13.5 లక్షల టికెట్స్‌ అమ్ముడయ్యాయి. మరోవైపు అమెరికాలోనూ ఈ చిత్రం 3 మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేసింది. ఇది ఇలాగే కొనసాగితే ఈ చిత్రం మరెన్నో రికార్డులు నెలకొల్పడం ఖయమని అభిమానులు అంటున్నారు. దుమ్మురేపుతున్న కల్కీ థీమ్ సాంగ్, సినిమా స్టోరీ అంతా ఒకే పాటలో, వీడియో ఇదిగో..

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌, కమల్‌ హాసన్, దీపికా పదుకొణె, శోభన తదితరులు నటించారు. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్‌ హీరో నాని కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. నాని ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. అలాగే విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌, మృణాల్ ఠాకూర్‌ కూడా ఉన్నట్లు సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయంలో స్పష్టత రావాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement