Actor Kundara Johny Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, విలన్‌ రోల్స్‌లో మెప్పించిన సీనియర్ నటుడు కన్నుమూత, నివాళులు అర్పిస్తున్న మలయాళీ ఇండస్ట్రీ

మలయాళీ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కుందార జానీ (71) కన్నుమూశారు (Kundara Johny dies). గతరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కొల్లంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఆయన మరణంపై (Kundara Johny dies) మలయాళీ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

Actor Kundara Johny Dies (PIC@ X)

Kollam, OCT 18: మలయాళీ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కుందార జానీ (71) కన్నుమూశారు (Kundara Johny dies). గతరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కొల్లంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఆయన మరణంపై (Kundara Johny dies) మలయాళీ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. చివరిగా 2022లో ఆయన మెప్పాడియాన్ (Meppadiyan) అనే మూవీలో నటించారు.

 

80, 90వ దశకాల్లో అనేక సినిమాల్లో కుందార జానీ నెగెటివ్ రోల్స్‌ లో నటించి మెప్పించారు. 1979లో సినీ కెరీర్ ను ప్రారంభించిన కుందార జానీ..అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్స్ తో అనేక సినిమాల్లో నటించి, మెప్పించారు. నడోడిక్కట్టు (Nadodikkattu) సినిమాలో ఆయన పోషించిన నంబియార్ పాత్రతో ప్రతి ఒక్కరి మెప్పు పొందారు. వాటితో పాటూ ఒరు సీబీఐ డైరీ కురిప్పు, కిరీదం, స్పదికం వంటి హిట్ సినిమాల్లో కీ రోల్స్ చేశారు. కుందార జానీ మరణంపై సంతాపం తెలుపుతూ పలువురు నటులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement