
Hyd, Mar 4: హైదరాబాద్‌లో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం PS పరిధిలో దేవిక ( 35) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. 6 నెలల క్రితమే గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్న దేవిక, సతీష్. ప్రస్తుతం ఖాజాగుడా ప్రశాంతి హిల్స్‌లో నివాసం ఉంటున్నారు దంపతులు. అయితే ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. ఆదివారం అర్దరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని దేవిక ఆత్మహత్య (Newlywed Dies by Suicide) చేసుకుంది. భర్త వేధింపులే దేవిక ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు.
వికారాబాద్ ప్రాంతానికి చెందిన దేవిక (27) ఎంబీఏ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్న శరత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శరత్, దేవిక పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల్లో చెప్పడంతో పెద్దలు వారి పెళ్లికి అంగీకరించారు. 2024 ఆగస్టులో కింద శరత్‌ను దేవిక ప్రేమ వివాహం చేసుకుంది.వివాహం సమయంలో శరత్‌కు రూ.5 లక్షల నగదు, 15 తులాల బంగారం కట్నకానుకలుగా ఇచ్చారు. అదనపు కట్నం కోసం కొన్నాళ్లుగా శరత్ వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ గొడవలతో మనస్తాపానికి లోనయిన దేవిక సోమవారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
Newlywed Dies by suicide in Hyderabad
హైదరాబాద్‌లో నవ వధువు ఆత్మహత్య
రాయదుర్గం PS పరిధిలో దేవిక ( 35) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.
6 నెలల క్రితమే గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్న దేవిక, సతీష్.
ఖజాగుడా ప్రశాంతి హిల్స్‌లో నివాసం ఉంటున్న దంపతులు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.
ఆదివారం అర్దరాత్రి ఇంట్లో ఫ్యాన్… pic.twitter.com/Enh9jrN5EC
— ChotaNews App (@ChotaNewsApp) March 4, 2025
దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించిన భర్త శరత్ వెంటనే దేవిక కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు వెంటనే చేరుకుని షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి కుటుంబసభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదనపు కట్నం కోసం శరత్ తమ కూతురు దేవికను వేధించేవాడని దేవికా తల్లి రామలక్ష్మి ఆరోపిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.