Tamil Actors Fans War: ఇద్దరి అగ్ర హీరోల ఫ్యాన్స్ వివాదం, ఒకరిని హత్య చేసిన మరొకరు, నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించిన మరకనం పోలీసులు

అభిమానం నిజంగా కొన్ని సమయాల్లో ప్రాణాంతకమవుతుంది. ఇలాంటి అనేక సంఘటనలు గతంలో సాక్ష్యమిచ్చాయి. కోలీవుడ్ తారలు రజనీకాంత్, విజయ్ ల మతోన్మాదం కారణంగా తమిళనాడులో ఇలాంటి ఒక షాకింగ్ సంఘటన జరిగింది. కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్ మీ హీరో నే తక్కువ ఇచ్చాడు. లేదు మా హీరోనే ఎక్కువగా ఇచ్చారంటూ అభిమానులు ఒకరినొకరు తిట్టుకున్నారు. అది చివరికి చిలికి చిలికి గాలివానలా మారి హత్యకు దారితీసింది.

Rajinikanth, Thalapathy Vijay (Photo Credits: Instagram)

April 24: అభిమానం నిజంగా కొన్ని సమయాల్లో ప్రాణాంతకమవుతుంది. ఇలాంటి అనేక సంఘటనలు గతంలో సాక్ష్యమిచ్చాయి. కోలీవుడ్ తారలు రజనీకాంత్, విజయ్ ల మతోన్మాదం కారణంగా తమిళనాడులో ఇలాంటి ఒక షాకింగ్ సంఘటన జరిగింది. కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్ మీ హీరో నే తక్కువ ఇచ్చాడు. లేదు మా హీరోనే ఎక్కువగా ఇచ్చారంటూ అభిమానులు ఒకరినొకరు తిట్టుకున్నారు. అది చివరికి చిలికి చిలికి గాలివానలా మారి హత్యకు దారితీసింది. తారక్ ఛాలెంజ్ పూర్తి చేసిన చిరు. కేటీఆర్‌,రజినీకాంత్‌ల‌ను నామినేట్ చేసిన మెగాస్టార్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న బి ది రియల్‌ మ్యాన్‌ ఛాలెంజ్

రజిని కాంత్ (Rajinikanth) , విజయ్ లకు (Thalapathy Vijay) తమిళనాడులేనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఆ అభిమానమే విజయ్ అభిమాని ప్రాణం తీసింది. విజయ్ కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్ కోసం రూ .1.3 కోట్లు కేంద్రానికి, రాష్ట్రానికి విరాళంగా ఇచ్చారు. రజినీ కాంత్ సైతం కరోనా రిలీఫ్ ఫండ్ (COVID-19 Donations) ను రూ.50లక్షలు అందించారు. నడిగర్ సంగం సభ్యులకు కిరాణా సామాగ్రిని విరాళంగా ఇవ్వనున్నారు. ఆ విరాళం ఇద్దరు హీరోల అభిమానుల మధ్య చిచ్చు రేపింది.

గురువారం (ఏప్రిల్ 23) సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాని ( Rajinikanth Fan) దినేష్ బాబుతో, విజయ్ అభిమాని యువరాజ్ (Vijay Fan) మరియు అతని స్నేహితులు వాగ్వాదానికి దిగారు. మీ హీరో రిలీఫ్ ఫండ్ తక్కువగా ఇచ్చాడు లేదు మా హీరో రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇచ్చాడంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ సందర్భంగా దినేష్ బాబు, యువరాజ్ పై దాడి చేశాడు. ఈ దాడిలో యువరాజ్ దుర్మరణం పాలయ్యారు. ఈ హత్యకు సంబంధించి మరకనం పోలీసు అధికారులు దినేష్ బాబును అరెస్ట్ చేశారు. హత్యకు సంబంధించి తదుపరి దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు.

వారు మాత్రమే కాదు, దక్షిణ పరిశ్రమలోని ఇతర తారలు కూడా అవసరమైన సేవా సంస్థలకు సహాయం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. దురదృష్టకర సంఘటనపై నటులు ఇంకా వ్యాఖ్యానించలేదు. దేశంలోని సూపర్ స్టార్ల అభిమానం హద్దు మీరిపోతున్నారనేదానికి ఇది మరొక ఉదాహరణగా చెప్పవచ్చు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement