Sai Pallavi Badaga Dance: చెల్లి పెళ్లిలో సాయి ప‌ల్లవి ఎంజాయ్ మామూలుగా లేదు క‌దా! ఫ్యామిలీతో క‌లిసి సాంప్ర‌దాయ డ్యాన్స్ చేసిన న‌టి (వీడియో ఇదుగోండి)

న‌టి సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ (Sai Pallavi Sister) పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. తన చిరకాల ప్రియుడు వినీత్‌తో పూజ ఏడడుగులు వేసింది. నటి సాయి పల్లవితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశారు. అయితే ఈ పెళ్లి వేడుక‌లో చెల్లి పూజా కన్నన్‌తో (Pja Kannan) క‌లిసి సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ చేసింది.

Sai Pallavi (Photo Credits: X)

Chennai, SEP 05: న‌టి సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ (Sai Pallavi Sister) పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. తన చిరకాల ప్రియుడు వినీత్‌తో పూజ ఏడడుగులు వేసింది. నటి సాయి పల్లవితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశారు. అయితే ఈ పెళ్లి వేడుక‌లో చెల్లి పూజా కన్నన్‌తో (Pja Kannan) క‌లిసి సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ చేసింది. మ‌రాఠీ సాంగ్ అప్స‌ర అలీ (Apsara Ali Song) పాట‌కు వీళ్లిద్ద‌రు డ్యాన్స్ (Badaga Dance) చేయ‌గా.. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Sai Pallavi Performing Badaga Dance

 

ఇక ఈ వీడియోను మీరు చూసేయండి. సాయి పల్లవి సోదరి పూజ కూడా సినిమాల్లో నటించింది. అయితే పెద్దగా స‌క్సెస్ కాలేదు. పూజా కన్నన్ తమిళంలో ‘చిత్తిరై సెవ్వనం’(Chithirai Sevvaanam) అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో సముద్రఖణి కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత పూజాకి మరో సినిమాలో న‌టించ‌లేదు. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా సాయి పల్లవికి మేనేజర్‌గా ఉంటోంది పూజ.

Devara Chuttamalle Song: 100 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న దేవర చుట్టమల్లె సాంగ్, నాలుగు వారాలుగా మోస్ట్‌ ట్రెండింగ్‌ జాబితాలో.. 

ఇక సాయి ప‌ల్ల‌వి సినిమాల విష‌యానికి వ‌స్తే.. నాగ చైత‌న్య‌తో ప్ర‌స్తుతం తండేల్ అనే సినిమాలో న‌టిస్తుంది. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నాడు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now