Saif Ali Khan Stabbing Case: వివాదంలో బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా, ఆస్పత్రిలో ఉన్న సైఫ్ అలీ ఖాన్‌పై పెట్టిన పోస్టుపై దుమారం
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) దాడికి సంబంధించి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజాగా సీనియర్ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha) కూడా ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాడు
Kolkata, JAN 19: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) దాడికి సంబంధించి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజాగా సీనియర్ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha) కూడా ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాడు. అయితే ఈ పోస్ట్‌కి ఆయన ఆసుపత్రిలో నవ్వుకుంటూ ఉన్న సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఏఐ ఫొటోలను జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ విమర్శలు ఎదుర్కోవడంతో తాజాగా డిలీట్ చేశాడు.
Shatrughan Sinha Shares ‘Smiling’ AI-Generated Photo of Saif Ali
నాకు చాలా ఇష్టమైన వ్యక్తి సైఫ్ అలీఖాన్‌పై దాడి జరగడం చాలా దురదృష్టకరం. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ దాడి జరిపిన వారిపై ప్రభుత్వం కూడా వేగంగా చర్యలు తీసుకుంటుంది. పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయి అంటూ శత్రుఘ్న సిన్హా తెలిపాడు. అయితే దీనికి ఆయన పోస్ట్ చేసిన ఫొటో ఇప్పుడు వివాదాస్పందంగా మారింది.