Samantha Dance Video Viral: ఊ అంటావా మావా అంటూ రిహార్సల్ వీడియో రిలీజ్ చేసిన సమంత, వామ్మో ఏం షేపులు రా నాయనా, వైరల్ వీడియో...

సమంత పుష్ప సినిమాలో ఊ అంటావా మామ ఊ ఊ అంటావా’ అంటూ ఆమె బన్నీతో కలిసి స్టెప్పులేసి ప్రేక్షకుల్ని అలరించింది. పాటకు తన పడ్డ కష్టం,రిహార్సల్ చూపిస్తూ సమంత ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడీ ఈ పాటకు రీల్స్‌ చేయడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తుండగా.. మరోవైపు ఇదే పాటపై మీమర్స్‌ సరదా పేరడీలు సృష్టిస్తున్నారు.

Samantha Ruth Prabhu shared a BTS video of Pushpa Item Song

అల్లు అర్జున్ ‌(AlluArjun) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’ (PUSHPA). సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కు సైతం రెడీ అయ్యింది. ఈ సినిమా కోసం స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తొలిసారి స్పెషల్‌ సాంగ్‌ చేశారు. ‘ఊ అంటావా మామ ఊ ఊ అంటావా’ అంటూ ఆమె బన్నీతో కలిసి స్టెప్పులేసి ప్రేక్షకుల్ని అలరించారు. దీంతో ఈ పాటకు ప్రేక్షకాదరణ లభిస్తోంది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఈ పాటకు ఫిదా అయిపోతున్నారు.

ఈ నేపధ్యంలో ఈ పాటకు తన పడ్డ కష్టం,రిహార్సల్ చూపిస్తూ సమంత ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడీ ఈ పాటకు రీల్స్‌ చేయడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తుండగా.. మరోవైపు ఇదే పాటపై మీమర్స్‌ సరదా పేరడీలు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్ల మది దోచిన రీల్స్‌, పేరడీలకు మించి సమంత చేసిన రిహార్సల్  పై ఓ లుక్కేద్దాం..

‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సాగే ఈ మాస్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టు కునేలా పాడింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now