Suriya Tests Positive for Covid: కరోనా ఇంకా పోలేదు, నేను కరోనాతో బాధపడుతున్నాను, ట్విట్టర్ వేదికగా తెలిపిన నటుడు సూర్య, జాగ్రత్తగా ఉండాలని పిలుపు
తమిళ ప్రేక్షకులతోపాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో సూర్య కరోనావైరస్ (Suriya Tests Positive for Covid) బారీన పడ్డారు. ఈ విషయాన్ని హీరో సూర్య తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘నేను కరోనాతో బాధపడుతున్నాను. తర్వగానే కోలుకుంటున్నాు. జీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదని మనమందరం గ్రహిస్తాం. భయంతో స్తంభించలేరు.

అదే సమయంలో భద్రత మరియు శ్రద్ధ అవసరం. అంకితమైన సహాయక వైద్యులకు ప్రేమ మరియు ధన్యవాదాలు’’ అని తెలియజేస్తూ హీరో సూర్య ట్వీట్ చేశారు. తనను కలిసిన మిత్రులు అందరూ చెకప్ చేసుకోవాలని కూడా ఆయన సూచించారు.సూర్య ట్వీట్‌కు రియాక్ట్ అయిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తన 40వ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రీసెంట్‌గా లాంఛనంగా ప్రారంభమైంది. షూటింగ్స్, ఇతర పనులపై బయటకు వచ్చినప్పుడు సూర్యకు కోవిడ్ సోకి ఉండవచ్చుని భావిస్తున్నారు. గత ఏడాది ఓటీటీలో విడుదలైన ఆకాశం నీ హద్దురా(శూరరై పోట్రు) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను దక్కించుకున్నారు సూర్య. ఈ ఏడాది మన దేశం తరపున ఆస్కార్‌కు ఎన్నికైన చిత్రాల లిస్టులో ఇది కూడా ఉంది. సుధాకొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.