Vettaiyan Teaser: ఏడు పదుల వయస్సులోనూ అదే స్టైల్‌, రజనీకాంత్ కొత్త మూవీ వెట్టయన్ టీజర్ ఇదిగో, గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజువల్స్

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) నటిస్తోన్న తలైవా 170 (Thalaivar 170) టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు.

Rajinikanth in Vettaiyan (Photo Credits: YouTube)

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) నటిస్తోన్న తలైవా 170 (Thalaivar 170) టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇవాళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తలైవా 170 టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి Vettaiyan టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. బుక్‌ రీడింగ్‌ తర్వాత చేతిలో స్టిక్‌ పట్టుకొని.. స్టైలిష్‌ గాగుల్స్‌ పెట్టుకున్న రజినీకాంత్‌ విజువల్స్‌ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

కల్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ ఇదిగో, విశ్వాసంగా ఉండడానికి,విధేయతతో బతికేయడానికి కుక్క అనుకున్నావురా...లయన్ అంటూ మీసం మెలేసిన నందమూరి నట వారసుడు

ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇటీవలే సెట్స్‌లో నుంచి షూటింగ్‌ స్పాట్‌లో రజినీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ స్టిల్‌ను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.ఈ చిత్రంలో గురు ఫేం రితికా సింగ్ (Ritika Singh) ఈ చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు.

Here's Teaser

తలైవా దీంతోపాటు ఐశ్వర్య రజినీకాంత్‌ దర్శకత్వంలో లాల్‌సలామ్‌లో కూడా నటిస్తుండగా.. పొంగళ్‌ 2024 కానుకగా విడుదల కానుంది. రజినీకాంత్‌ మరోవైపు స్టార్ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తలైవా 171 కు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement