Chiranjeevi Bhola Shankar: బోళా శంకరుడిగా చిరంజీవి, మెగాస్టార్ 154వ చిత్రం బోళా శంకర్‌ సినిమా పోస్టర్‌ను విడుదల చేసిన మహేష్ బాబు, తమిళ్ బ్లాక్ బస్టర్ వేదాళం రీమేక్‌గా భోళా శంకర్‌

చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు.

Chiranjeevi Bhola Shankar (Photo-Twitter)

చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి ‘బోళా శంకర్‌’ (Chiranjeevi Bhola Shankar) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు (Mahesh Babu) ఈ మూవీ టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

తమిళ్ బ్లాక్ బస్టర్ ‘వేదాళం రీమేక్ గా భోళా శంకర్‌ రూపొందబోతోంది. ఈ చిత్రం తమిళ వెర్షన్ లో అజిత్ హీరోగా నటించాడు. ఈ తెలుగు రీమేక్ లో ముందుగా పవన్ నటించాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రీమేక్ ను నాన్చుతునే ఉన్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రీమేక్ చేయబోతున్నారు. ఇందులో చిరు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు.

అన్నకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, చిరంజీవి నాకే కాదు ఎంద‌రికో మార్గ‌ద‌ర్శి అంటూ లేఖలో జనసేన అధినేత స్పష్టం

ఆయన ఈ సినిమాలో గుండుతో కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్‌ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు ట్వీట్ 

ఈ సందర్భంగా.."హ్యాపీ బర్త్ డే చిరంజీవి (Happy Birthday Chiranjeevi) గారు.. మీ సినిమా టైటిల్ 'భోళా శంకర్'ని లాంచ్ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నా స్నేహితుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో, నా ఫేవరెట్ నిర్మాత అనల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు బర్త్ డే జరుపుకుంటున్న మెగాస్టార్ ఆయురారోగ్యాలతో.. గొప్ప విజయాలతో ముందుకు కొనసాగాలని ఆకాంక్షిస్తూ .. ఆల్ ది బెస్ట్ సర్.." అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement