Pushpa Actor Arrest: జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య, పుష్ప సినిమా నటుడు జగదీష్‌ ప్రతాప్‌ని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు

జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలతో పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ పాత్ర చేసిన నటుడు జగదీష్‌ ప్రతాప్ ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూస్ వివరాల్లోకెళితే.. ఓ జూనియర్ ఆర్టిస్టు.. మరో వ్యక్తితో ఉన్నప్పుడు నటుడు జగదీశ్ ఫొటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.

Pushpa Actor Jagadeesh Prathap Arrest

Pushpa Actor Jagadeesh Prathap Arrest : జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలతో పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ పాత్ర చేసిన నటుడు జగదీష్‌ ప్రతాప్ ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూస్ వివరాల్లోకెళితే.. ఓ జూనియర్ ఆర్టిస్టు.. మరో వ్యక్తితో ఉన్నప్పుడు నటుడు జగదీశ్ ఫొటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.

ఈ వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన సదరు మహిళ (జూనియర్ ఆర్టిస్టు).. గత నెల 29న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. దీనంతటికి కారణం 'పుష్ప' నటుడు జగదీష్ అని నిర్ధారించుకున్నారు.అయితే గత కొన్నిరోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఇతడిని.. అరెస్ట్ చేసి, కోర్టులో బుధవారం హాజరు పరిచారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్‌కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.

సల్మాన్ ఖాన్‌ వేరే దేశం పారిపో.. లేకపోతే చావు ఖాయం! లారెన్స్ బిష్ణోయ్ నుంచి కండలవీరుడికి మరోసారి బెదిరింపులు

జగదీష్.. మల్లేశం, జార్జిరెడ్డి, పలాస 1978 తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా సుకుమార్ దృష్టిలో పడి 'పుష్ప' లాంటి పాన్ ఇండియా మూవీలో అవకాశం దక్కించుకున్నాడు. మచ్చ మచ్చ అని అల్లు అర్జున్ కూడా ఉండే పాత్రలో కామెడీ పండించాడు. 'సత్తిగాని రెండెకరాలు' అనే సినిమాలో హీరోగానూ నటించాడు. 'పుష్ప 2'తో బిజీగా ఉన్న ఇతడు అరెస్ట్ ఇప్పుడు ఒక్కసారిగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement