Hyper Aadi: రాజకీయాల్లోకి హైపర్ ఆది, ఎమ్మెల్యే టిక్కెట్ కోసమే పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా కలిశారా, ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేసే చాన్స్ ?

హైపర్ ఆది పవర్ స్టార్ ను పర్సనల్ గా కలిసి తన మనస్సులో మాట చెప్పారట. అయితే హైపర్ ఆది ఎందుకు కలిశారు అనే విషయం బయటకు రావడం లేదు.

Jabardasth comedian Hyper Aadi (Photo-Facebook)

జబర్దస్త్ షోలో హైపర్ ఆది కామెడీ టైమింగ్ పంచులు మామూలుగా ఉండవు. ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ తో పాటు సినిమాల్లో కూడా మంచి హాస్య నటుడిగా పేరు సంపాదిస్తున్నారు. ఇప్పటికే అనేక సినిమాల్లో ఆయన కామెడీ పంచులను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో హైపర్ ఆది ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొదటి నుంచి హైపర్ ఆది కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయనకు పెద్ద అభిమాని.

ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి తప్పనిసరిగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో హైపర్ ఆది పవర్ స్టార్ ను పర్సనల్ గా కలిసి తన మనస్సులో మాట చెప్పారట. అయితే హైపర్ ఆది ఎందుకు కలిశారు అనే విషయం బయటకు రావడం లేదు. కానీ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు మూవీ లో హైపర్ ఆది కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారట, అందుకోసమే ఆయనను కలిసినట్లు బయటక చెబుతున్నారు.

Neelam Gemstone Benefit: నీలమణిని ఏ రాశి వారు ధరించాలి, నీల మణి రత్నం ఉంగరంలో ధరించిన తర్వాత చేయాల్సిన పని ఇదే..

గతంలో నాగబాబు ఎలక్షన్ సమయంలో హైపర్ ఆది ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే జనసేన నుంచి ఏదైనా పని చెప్పినా తప్పకుండా చేస్తానని ఆది పవన్ తో చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే హైపర్ ఆది ఎమ్మెల్యే గా ఛాన్స్ వస్తే పోటీ చేస్తారా అని ఇటీవల ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు హైపర్ ఆది అలాంటిదేమీ లేదు ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని పిలిచి టికెట్ ఇస్తే ఏం చేస్తారు.. అని మీడియా ప్రతినిధి అడినప్పుడు, అనుభవం కూడా కావాలి కదా అని బదులిచ్చారు. అయితే హైపర్ ఆదికి ప్రకాశం జిల్లాలో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement