Jabardasth Apparao: కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు, తనను అన్యాయంగా గెంటేశారని తెలిపిన జబర్దస్త్ కమెడియన్ అప్పారావు
కమెడియన్ అప్పారావు (Jabardasth Apparao) కూడా ఈ షో పై కొన్ని ఆరోపణలు చేశాడు. ఈ షో నుంచి తనను అన్యాయంగా గెంటేశారు అని అన్నాడు. తాను జబర్దస్త్ లో సీనియర్ కమెడియన్ అని.. అయినా కూడా తనకు మర్యాద ఇవ్వలేదని అన్నారు.
బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 8 ఏళ్ళ నుండి మల్లెమాల ప్రొడక్షన్ లో ప్రసారమవుతున్న ఈ షో ప్రేక్షకులకు బాగా దగ్గరగా మారింది.అయితే ఈ మధ్య ఈ షో బాగా దారుణమైన ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది. కారణమేంటంటే.. ఇష్టం వచ్చిన మాటలతో.. చేష్టలతో కమెడియన్లు రెచ్చిపోతూ ఉన్నారు. దీంతో చాలామంది ఈ షోను చూడటానికి కూడా అంతగా ఇష్టపడటం లేదు. పైగా అందులో పనిచేసే బయటికి వచ్చిన కమెడియన్ లు కూడా ఈ (Jabardasth) నిర్వాహకుల గురించి ఆరోపణలు చేస్తున్నారు.
తాజాగా కమెడియన్ అప్పారావు (Jabardasth Apparao) కూడా ఈ షో పై కొన్ని ఆరోపణలు చేశాడు. ఈ షో నుంచి తనను అన్యాయంగా గెంటేశారు అని అన్నాడు. తాను జబర్దస్త్ లో సీనియర్ కమెడియన్ అని.. అయినా కూడా తనకు మర్యాద ఇవ్వలేదని అన్నారు. మొదట్లో తాను షకలక శంకర్ టీంలో పని చేశాను అని.. ఆ తర్వాత రచ్చ రవి టీం లో కూడా పని చేశాను అని.. అలా ఆ తర్వాత పంచ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్ చేసి తను కూడా ఒక టీం లీడర్ గా ఎదిగానని అన్నాడు. కానీ సోలో టీమ్ లీడర్ గా 11 వారాలు మాత్రమే చేశాను అని.. ఆ తర్వాత కరోనా రావడంతో కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ వెళితే.. ఇప్పుడు కరోనా ఉంది అని.. మీకు వయసు అయిపోయింది అని అన్నారట. అంతేకాకుండా కొంత కాలం ఆగి చేద్దురుగాని అలా వారి పిలుపు కోసం ఎదురు చూశాను అని కానీ ప్రయత్నం లేదు అని అన్నాడు.
మొత్తానికి అప్పారావు ఇప్పుడు జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక జబర్దస్త్ గుట్టును బయట పెట్టాడు. ఇక ఈయన వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించాడు. అప్పుడప్పుడు ఇతర షోలలో కూడా ఎంట్రీ ఇస్తూ తన కామెడీతో అందరినీ నవ్విస్తూ ఉంటాడు. మరి జబర్దస్త్ నిర్వాహకులు ఈయన మాటలు విని మళ్లీ జబర్దస్త్ లోకి తీసుకుంటారో లేక తమ గుట్టును బయటపెట్టినందుకు ఆయనను మళ్లీ ఏదైనా విషయంలో టార్గెట్ చేస్తారో చూడాలి.