AP Inter Results 2023: రేపు సాయంత్రం ఒకేసారి ఏపీ ఫస్ట్‌, సెకండియర్‌ ఫలితాలు విడుదల, bie.ap.gov.in ద్వారా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరి రావు వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో ఇలా ఒకేసారి ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి.

Representational Picture. Credits: PTI

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరి రావు వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో ఇలా ఒకేసారి ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. రేపు(బుధవారం) సాయంత్రం 5 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు.

నేటి నుంచి తెలంగాణలో వేసవి సెలవులు, జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్న బడులు

ఈ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజ‌రయ్యారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 15వ తేదీన‌ ప్రథమ సంవత్సరం, 16వ తేదీన‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విష‌యం తెలిసిందే. కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలను ఇంటర్‌ బోర్డు ప్రకటించబోతోంది.విద్యార్థులు bieap.apcfss.in, bie.ap.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇతర వెబ్ సైట్ లలోను ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement