7th Pay Commission Update: ఇక పండగ చేస్కోండి! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ దసరా బొనాంజా ప్రకటించనున్న మోడీ సర్కార్. ఉద్యోగులు కోరినంతా డి.ఎ ఇచ్చేందుకు కేంద్రం సుముఖత.

తంలో 3 శాతం మాత్రమే డి.ఎ పెంచిన కేంద్రం, ఈ సారి మాత్రం వారు కోరుకుంటున్నట్లుగా 5% శాతం అంటే ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతంతో కలిపి మొత్తం జీతంలో 17 శాతం డి.ఎ అదనంగా ఇచ్చేందుకు కేంద్ర సుముఖంగా ఉన్నట్లు సమాచారం..

Central government staff likely to get hike as per 7th pay commission recommendations.| (Photo Credit: File)

రానున్న పండగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం భారీ బొనాంజాను అందించేందుకు సిద్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో పనిచేసే ఉద్యోగులందరికి దసరా కానుకగా అధిక మొత్తంలో డి.ఎ 'dearness allowance (DA)' పెంపుదల చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ మేరకు 7వ వేతన సంఘం (7th Pay Commission) సిఫారసులను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.

ఉద్యోగులకు అందించాల్సిన డి.ఎ విషయంలో ప్రతి ఆరు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం విశ్లేషణ చేపడుతుంది. ఆ తర్వాత రెండు నెలల్లో పెంచిన డి.ఎను అమలు చేస్తారు. ఈ ఏడాది జనవరిలో డి.ఎను పెంచిన ప్రభుత్వం, ఆ తర్వాత జూలైలో మరోసారి పెంచాల్సి ఉంది. అయితే కొన్ని పాలనాపరమైన కారణాల చేత డి.ఎ పెంపుదల వాయిదా పడుతూ పోతుంది. అయితే అక్టోబర్ 8 నుంచి దసరా పండుగ మొదలవుతున్న నేపథ్యంలో ఈ జూలై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలను ఏరియర్స్ రూపంలో కలిపి, మొత్తం ఒకేసారి అక్టోబర్ లో ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం జీతంతో పాటు 12 శాతం డి.ఎ అందుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదనంగా మరో 5 శాతం డి.ఎ పెంపును కోరుకుంటున్నారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న కనీస వేతనం రూ. 18 వేల నుంచి రూ. 26 వేలకు చేరుతుంది. దీంతో ఒక్కొక్క ఉద్యోగి జీతంలో భారీ పెరుగుదల ఉంటుంది. గతంలో 3 శాతం మాత్రమే డి.ఎ పెంచిన కేంద్రం, ఈ సారి మాత్రం వారు కోరుకుంటున్నట్లుగా 5% శాతం అంటే ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతంతో కలిపి మొత్తం జీతంలో 17 శాతం డి.ఎ అదనంగా ఇచ్చేందుకు కేంద్ర సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Good News To TGSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!

IT Employees Suffer Overweight: హైదరాబాద్ భారతదేశానికి మధుమేహ రాజధానిగా మారుతోంది, AIG హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో

YS Jagan on AP Budget: బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ అయింది, కూటమి బడ్జెట్ మీద మండిపడిన వైఎస్ జగన్

SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

Advertisement
Advertisement
Share Now
Advertisement