TGSRTC (Photo-X)

Hyderabad, Mar 7: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు (Good News To TGSRTC Employees) రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ (DA) ఇవ్వనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం పడనున్నట్టు వెల్లడించారు. తమ ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు.. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం  ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభంకానున్నట్టు వెల్లడించారు.మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా మొదటి దశలో అద్దె ప్రాతిపదికన 150 బస్సులు.. తరువాత దశలో ఆర్టీసీలోకి 450 బస్సులు తేనున్నట్టు వివరించారు.

ఎలాన్‌ మస్క్‌కు మరో షాక్.. పేలిన స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్, జనాలున్న స్థలాల్లోనే పడిన శకలాలు, వీడియో ఇదిగో

రేపు మహిళా శక్తి బస్సులు షురూ..

రాష్ట్రంలోని మహిళలకు ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. తాజాగా వారికి మరో శుభవార్త చెప్పింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు.. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించాలని నిర్ణయించింది. మహిళలతోనే బస్సులు కొనుగోలు చేయించి.. వారి ఆధ్వర్యంలోనే ఆర్టీసీలో అద్దె నడపనుంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సమాఖ్యలకు ప్రభుత్వమే బ్యాంకు గ్యారంటీ ఇస్తుంది. ఈ మేరకు మార్గదర్శకాలను వివరిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేపు అంటే శనివారం మహిళా శక్తి బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

 డోనాల్డ్ ట్రంప్ దూకుడు! పాక్, ఆఫ్టనిస్తాన్‌పై ట్రావెల్ బ్యాన్‌ విధించే యోచన, వచ్చేవారమే అమల్లోకి వస్తుందని కథనాలు