IPL Auction 2025 Live

USB Charger Scam: పబ్లిక్‌ ప్లేస్ లలో ఉండే యూఎస్బీ చార్జింగ్‌ పోర్టళ్ల పట్ల జాగ్రత్త.. పోర్టళ్ల ద్వారా దుండగులు ఫోన్‌ లలోని సమాచారాన్ని చోరీ చేసే ప్రమాదం.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

హోటళ్లు, బస్టాండ్లు, కేఫ్‌ లు, ఎయిర్‌పోర్టులు తదితర ప్రదేశాల్లో ఉండే పబ్లిక్‌ చార్జింగ్‌ పోర్టళ్ల స్మార్ట్‌ ఫోన్‌ లకు చార్జింగ్‌ పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నది.

USB charger (Credits: X)

Newdelhi, Mar 31: దేశ ప్రజలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హోటళ్లు (Hotels), బస్టాండ్లు (Bus Stations), కేఫ్‌ లు (Cafes), ఎయిర్‌పోర్టులు తదితర ప్రదేశాల్లో ఉండే పబ్లిక్‌ చార్జింగ్‌ పోర్టళ్ల (USB charger scam) స్మార్ట్‌ ఫోన్‌ లకు చార్జింగ్‌ పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నది. పబ్లిక్‌ చార్జింగ్‌ పోర్టళ్ల ద్వారా దుండగులు ఫోన్‌ లలోని సమాచారాన్ని చోరీ చేయవచ్చని, హానికరమైన యాప్‌ లను ఫోన్‌ లలో ఇన్‌స్టాల్‌ చేయవచ్చని తెలిపింది. డాటాను తొలగించి మళ్లీ రిస్టోర్‌ చేయడానికి డబ్బులు అడిగే అవకాశం కూడా ఉందని పేర్కొన్నది. ఈ మేరకు ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సెర్ట్‌) శనివారం కీలక సూచన చేసింది. బయటకు వెళ్లినప్పుడు పవర్‌ బ్యాంకులు లేదా చార్జర్లను తీసుకెళ్లాలని సెర్ట్‌ సూచించింది.

LSG Vs PBKS: హోం గ్రౌండ్ లో చిత‌క్కొట్టిన ల‌క్నో, 21 ప‌రుగుల తేడాతో పంజాబ్ పై విజ‌య‌దుందుబి

తప్పనిసరైతే.. ఇలా చేయండి

ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్‌ చార్జింగ్‌ పోర్టళ్లలో చార్జింగ్‌ పెట్టాల్సి వచ్చినప్పుడు ఫోన్‌ లను స్విచాఫ్‌ చేసి పెట్టాలని సూచించింది. ఏదైనా సైబర్‌ మోసానికి గురైతే www.cybercrime.gov.in పోర్టల్‌లో లేదా 1930 నెంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నది.

Viral Video : న‌ల్ల‌మ‌ద్ది చెట్టు నుంచి ఉప్పొంగిన నీళ్లు.. చెట్టును నరికే కొద్దీ ఉబికి వస్తున్న నీరు.. పాపికొండల అటవీ ప్రాంతంలో అద్భుత దృశ్యం..