Delhi, January 15: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో ఇవాళ కీలక ఘట్టం జరగనుంది. ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. సెంట్రల్ ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేయనుండగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఈడీ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అమోదం తెలిపింది.
2021-22 ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన లిక్కర్ స్కామ్‌లో, అరవింద్ కేజ్రీవాల్‌పై ED కేసు దాఖలు చేసింది. అయితే, PMLA ప్రత్యేక కోర్టు వారి మీద అభియోగాల చార్జీ ఫ్రేమింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే మనీష్ సిసోడియా ప్రాసిక్యూషన్‌కు హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.
అయితే నవంబర్ 6న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ప్రజాప్రతినిధులను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రత్యేక అనుమతి అవసరమని పేర్కొంది. ఈ తీర్పు వల్ల నిందితులు తమపై దాఖలు చేసిన అభియోగాలను రద్దు చేయాలని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. వీడియో ఇదిగో, మహా కుంభమేళాలో ఒక్క రోజే కోటి మంది పుణ్యస్నానాలు,భక్తులతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్‌లు
కేజ్రీవాల్ కేసుతో పాటు, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వంటి పలువురు నాయకులపై కూడా ప్రాసిక్యూషన్ అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. ఢిల్లీ ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.