Cyclone Biparjoy: అతి తీవ్ర తుపానుగా మారిన బిపర్‌జోయ్.. 15న తీరానికి.. మాండ్వీ-కరాచీ మధ్య తీరం దాటనున్న తుపాను.. గంటకు గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో గాలులు

అరేబియా సముద్రంలో (Arabian Sea) ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) అతి తీవ్ర తుపానుగా (Severe Cyclone) మారింది.

Cyclone | Representational Image (Photo Credits: Pixabay)

Newdelhi, June 11: అరేబియా సముద్రంలో (Arabian Sea) ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) అతి తీవ్ర తుపానుగా (Severe Cyclone) మారింది. సౌరాష్ట్ర-కచ్, దానిని ఆనుకుని ఉన్న పాకిస్థాన్ (Pakisthan) తీరాల్లో ఈ నెల 15న మధ్యాహ్నం అది తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ-IMD) తెలిపింది. ప్రస్తుతం ఇది తూర్పు మధ్య అరేబియా సముద్రంలో పోర్‌బందర్‌కు దక్షిణ-నైరుతికి 480 కిలోమీటర్ల దూరంలో, ద్వారకకు దక్షిణ-నైరుతిగా 530 కిలోమీటర్ల దూరంలో, కచ్‌లోని నలియాకు దక్షిణ-నైరుతికి 610 కిలోమీటర్ల దూరంలో, పాకిస్థాన్‌లోని కరాచీకి దక్షిణాన 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు

జూన్ 14 వరకు ఇది ఉత్తరం వైపుగా కదిలే అవకాశం ఉందని, ఆ తర్వాత ఉత్తరం-ఈశాన్యం దిశగా కదులుతూ సౌరాష్ట్ర, కచ్..  దానికి ఆనుకుని ఉన్న మాండ్వీ (గుజరాత్), కరాచీ (పాకిస్థాన్) మధ్య పాకిస్థాన్ తీరాలను దాటి 15న మధ్యాహ్నం అత్యంత తీవ్ర తుపానుగా మారుతుందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Weather Forecast: ఐఎండీ అలర్ట్, 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాను ఉపరితల ఆవర్తనం

Cyclone Coming? మళ్లీ దూసుకొస్తున్న ఇంకో తుపాను? కోస్తాంధ్ర, రాయలసీమల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, వివిధ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక

Weather Forecast: నైరుతి బంగాళాఖాతంలో మళ్లీ ఇంకో అల్పపీడనం, ఈ సారి దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం, ఈ నెల రెండో వారంలో ఏర్పడే సూచనలు ఉన్నాయంటున్న ఐఎండీ అధికారులు

Cyclone Fengal Update: తమిళనాడులో ఫెంగల్ తుఫాను విధ్వంసం, రూ. 2వేల కోట్లు మధ్యంతర సాయం ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ, వచ్చే మూడు రోజుల పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్ష సూచన

Advertisement
Advertisement
Share Now
Advertisement