IPL Auction 2025 Live

Deadline to Update Aadhaar for Free: ఆధార్‌ కార్డు ఉచిత అప్‌ డేట్‌ కు జూన్‌ 14 ఆఖరు.. పాత కార్డు పని చేయదనేది తప్పుడు ప్రచారమన్న యూఐడీఏఐ

ఆ తర్వాత అప్‌ డేట్‌ చేసుకొనే వారు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Aadhaar (Credits: Pixabay)

Newdelhi, May 25: ఆన్‌ లైన్లో (Online) ఆధార్‌ (Aadhaar) వివరాలను ఉచితంగా అప్‌ డేట్‌ (Free Update) చేసేందుకు జూన్‌ 14 తేదీ చివరిది. ఆ తర్వాత అప్‌ డేట్‌ చేసుకొనే వారు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు యూఐడీఏఐ మరోసారి గుర్తు చేసింది. గత పదేండ్లుగా ఆధార్‌ కార్డును ఎలాంటి అప్‌ డేట్‌ చేసుకొని వారు ఈ ఉచిత అప్‌ డేట్‌ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. అయితే జూన్‌ 14 తర్వాత ఇప్పుడున్న పాత ఆధార్‌ కార్డు పనిచేయకుండా పోతుందని సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతున్నది. దీనిపై కూడా యూఐడీఏఐ స్పందించింది.

ఢిల్లీలో ఘోరం.. అర్ధరాత్రి పిల్లల దవాఖానలో అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువుల మృతి (వీడియో)

యూఐడీఏఐ ఏమన్నది?

పాత ఆధార్‌ కార్డు పనిచేయకుండా పోతుందన్న ప్రచారాన్ని యూఐడీఏఐ ఖండించింది. జూన్‌ 14 తేదీ అనేది ఉచిత అప్‌ డేట్‌ కు చివరి అవకాశమే తప్ప పాత ఆధార్‌ కార్డు పనిచేయకుండా పొవడం అనేది ఉండదని స్పష్టం చేసింది.

బీ అల‌ర్ట్! జూన్ నెల‌లో బ్యాంకుల‌కు ఏకంగా 10 రోజులు సెల‌వులు, ఏయే రోజుల్లో బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయంటే? పూర్తి లిస్ట్ ఇదుగోండి!