Power Saving Tips For House: మీరు చేస్తున్న ఈ చిన్న పొరపాట్లే కరెంట్ బిల్లును పెంచేస్తున్నాయి, ఈ సింపుల్ చిట్కాలతో వందల్లో కరెంట్ బిల్లు ఆదా చేసుకోవచ్చు, అవేంటో చూడండి

ఒకప్పుడు వందల్లో వచ్చే కరెంట్ బిల్లు(Power bill)…ఇప్పుడు వేలల్లో వస్తుందా? అయితే అది ఖచ్చితంగా మీ తప్పే. మీరు చేసే చిన్న చిన్న తప్పిదాలే…కరెంట్ బిల్లును అమాంతం పెంచేస్తున్నాయి. కొన్ని సింపుల్ చిట్కాలను(Tips) పాటిస్తే కరెంట్ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చు

Hyderabad December 08: ఒకప్పుడు వందల్లో వచ్చే కరెంట్ బిల్లు(Power bill)…ఇప్పుడు వేలల్లో వస్తుందా? అయితే అది ఖచ్చితంగా మీ తప్పే. మీరు చేసే చిన్న చిన్న తప్పిదాలే…కరెంట్ బిల్లును అమాంతం పెంచేస్తున్నాయి. కొన్ని సింపుల్ చిట్కాలను(Tips) పాటిస్తే కరెంట్ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దామా!

ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్‌(Electronic appliances) కరెంట్‌ను జలగల్లా పీల్చేస్తాయి. కాబట్టే వీటికి వ్యాంపైర్‌ అని పేరు పెట్టారు. ఇవి ఆఫ్‌లో ఉన్నా కూడా ఇవి ఎంతో కొంత కరెంట్‌ను లాగేస్తుంటాయి. సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ల మొదలు..  వైఫై రూటర్లు(Wifi Routers), టీవీలు(TV), కంప్యూటర్‌లు(Computers), ఐరన్‌బాక్స్‌లు(Iron Box), వాషింగ్‌మెషీన్‌(Washing Machine), ల్యాప్‌ట్యాప్‌లు.. ఇలా ఫ్లగ్గులో ఉండి కూడా ఆఫ్‌లో ఉన్నప్పుడు కరెంట్‌(Power)ను తీసుకుంటాయి. అందుకే వినియోగించనప్పుడు వాటిని ఫ్లగ్‌ల నుంచి తొలగిస్తే కరెంట్ ఆదా అవుతుంది. ఈరోజుల్లో స్టాండ్‌బై మోడ్‌ ఆప్షన్‌తో వస్తున్నప్పటికీ.. అవి ఎంతో కొంత వాట్లలో పవర్‌ను లాగేస్తున్నాయి. కాబట్టి, వీటి విషయంలో ఈ చిన్న సలహా పాటిస్తే బెటర్‌.

ఇర వాషింగ్‌ మెషిన్‌(Washing Machine), గ్రీజర్‌-వాటర్‌ హీటర్‌(Water Heater), ఏసీలు.. ఇలా హెవీ అప్లయెన్సెస్‌ ఏవి వాడినా కరెంట్‌ బిల్లు ఎక్కువగానే వస్తుంటుంది. కానీ, వాటిని వాడే విధానంలో తేడాల వల్లే బిల్లులు అంతలా వస్తుంటాయి. కాబట్టి, ఒక పద్దతిలోనే వాటిని వాడాల్సి ఉంటుంది. వాషింగ్‌ మెషిన్‌ను ఫుల్‌ కెపాసిటీతో కాకుండా తక్కువ కెపాసిటీతో ఉపయోగించడం. అంటే తక్కువ బట్టలు వేసి.. రెగ్యులర్‌గా ఉతకడం.  దీనివల్ల ఫుల్‌ కెపాసిటీ టైంలో పడే లోడ్‌ పడి కరెంట్‌ ఎక్కువ ఖర్చు అవుతుంది. వాషింగ్‌ మెషిన్‌లు మాత్రమే కాదు.. ఏసీలు, హీటర్లు, గ్రీజర్లు.. ఇలా ఏవైనా సరే వాటి లెవల్‌కు తగ్గట్లుగా స్మార్ట్‌గా ఉపయోగించడం వల్ల కరెంట్‌ బిల్లులను తగ్గించుకోవచ్చు.

Uber Ride via WhatsApp: వాట్సాప్ ద్వారా ఉబెర్ క్యాబ్ బుకింగ్ ఇలా చేసుకోండి, ప్రపంచంలోనే తొలిసారిగా భారత్‌లో ఊబెర్ కొత్త ఫీచర్, ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా లక్నోలో అమలు

వీటితో పాటూ కొత్త అప్లయెన్సెస్ కొనే సమయంలో వాటి రేటింగ్‌ ను పరిగణలోకి తీసుకోవాలి. తక్కవు రేటుకు వస్తున్నాయి కదా..అని తక్కువ స్టార్ రేటింగ్ ఉన్నవాటిని కొంటే…తర్వాత కరెంట్ బిల్లుతో జేబుకు చిల్లు పడుతుంది.

బల్బులు(Bulbs), సీలింగ్‌ ఫ్యాన్‌(Fans)లు ఇంటి ప్రాథమిక అవసరాలు. అలాగే కరెంట్‌ బిల్లుల విషయంలో వీటి భాగస్వామ్యం కూడా ఎక్కువే!. చివరికి కరెంట్‌ తక్కువ లాగుతాయనుకునే.. సీఎల్‌ఎఫ్‌, ఎల్‌ఈడీ బల్బులు సైతం ఆఫ్‌ కరెంట్‌ను ఎక్కువే తీసుకుంటాయి. కాబట్టి, అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్‌ చేయడం, తక్కువ స్పేస్‌లో పని చేస్తున్నప్పుడు ఫోర్టబుల్‌ ల్యాంపులు, స్టడీ ల్యాంపులు ఉపయోగించడం బెటర్‌.

పాత అప్లియెన్సెస్‌.. కొత్తగా వస్తున్నవాటికన్నా ఎక్కువ ఎనర్జీని లాగేస్తాయి. అందుకు కారణం.. ఆప్టియం ఏజ్‌. అంటే కాలం చెల్లడంలాంటిదన్నమాట. అందుకే పాత అప్లియెన్సెస్‌ను మార్చేసి.. మంచి రేటింగ్‌ ఉన్న అప్లియెన్సెస్‌ను ఉపయోగించాలి.

మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌, దోమల బ్యాట్లు, ఛార్జింగ్‌ లైట్లు.. అవసరం లేకున్నా ఛార్జింగ్‌ పెట్టడం కొందరికి ఉండే అలవాటు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, దీనివల్ల కరెంట్‌ అడ్డగోలుగా కాలుతుంది. అందుకే అత్యవసం అయితేనే ఛార్జింగ్‌ పెట్టాలి. అవసరం లేనప్పుడు ఫ్లగ్‌ల నుంచి ఛార్జర్‌లను తొలగించాలి మరిచిపోవద్దు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement