Madhya Pradesh Shocker: పక్కింటి ఆంటీతో బెడ్‌పై తండ్రిని చూసిన కొడుకు! అక్రమ సంబంధం ఎక్కడ బయటపడుతుందో అని సొంతకొడుకునే చంపేసిన వ్యక్తి, చేతులు నరికి 400 అడుగుల బోరులో పడేసిన కిరాతకుడు
ఇది గమనించిన తండ్రి.. తాను ఐదేళ్లుగా గుట్టుగా కొనసాగిస్తున్న అక్రమ సంబంధం ఎక్కడ బయటపడుతుందోనని భయపడ్డాడు.
Bhopal, DEC 11: వివాహేతర సంబంధాలు (Affair) కుటుంబాలను ఛిన్నాభిన్న చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. భర్త, భార్య వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని తమ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టుకోవటమే కాకుండా కుటుంబ సభ్యులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న తన ఐదేళ్ల వివాహేతర సంబంధం (Affair)ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ఓ తండ్రి 15ఏళ్ల కొడుకును దారుణంగా (Kills Son) హత్యచేశాడు. ఈ దారుణ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ (Dewas) జిల్లా బరోఠా పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజుల కిందట ఈ దారుణం చోటు చేసుకుంది. బాంగరాదా గ్రామంలో డిసెంబర్ 4న తన తండ్రి (45) సమీప బంధువైన, పక్కింట్లో ఉండే ఆంటీతో ఒకే గదిలో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను బాలుడు చూశాడు. ఇది గమనించిన తండ్రి.. తాను ఐదేళ్లుగా గుట్టుగా కొనసాగిస్తున్న అక్రమ సంబంధం ఎక్కడ బయటపడుతుందోనని భయపడ్డాడు.
కన్న మమకారాన్నిసైతం మరిచిపోయిు కొడుకును అతికిరాతకంగా హత్య చేశాడు. బాలుడు మృతదేహం చేతులు నరికి 400 అడుగుల బోరుబావిలో పడేశాడు. మృతదేహాన్ని పొలాల వద్ద పొదల్లో పడేశాడు. నాలుగు రోజుల తరువాత గత మంగళవారం పొదల్లో మృతదేహాన్ని గుర్తించిన కొందరు విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు రంగంలోకిదిగి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుమారుడు కనిపించడం లేదని కనీసం ఫిర్యాదు చేయని తండ్రిపై అనుమానం రావటంతో పోలీసులు ప్రశ్నించారు. తొలుత తనకేమీ తెలియదన్నట్లు బుకాయించిన తండ్రి.. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయాన్ని చెప్పాడు. తాను వేరే మహిళతో ఉండటాన్ని తన కొడుకు చూశాడని, తమ అక్రమ సంబంధం ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళనతో హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో తండ్రి, హత్యకు సహకరించిన ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు.