Arnab Goswami's Bail Plea: అర్నాబ్ గోస్వామి అరెస్ట్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు, వ్యక్తిగత స్వేచ్ఛను, న్యాయాన్ని అవహేళన చేయడం కిందకే.., కేసు దర్యాప్తు చట్ట విరుద్ధంగా సాగుతోందని తెలిపిన అర్నాబ్ తరపు లాయర్

2018 నాటి ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామి బాంబే హైకోర్టు బెయిల్ పిటిషన్‌‌ (Arnab Goswami's Bail Plea) తిరస్కరణనూ సుప్రీంకోర్టులొ సవాల్ చేశారు. అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో (CBI) విచారణ చేయించేందుకు ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.

Arnab Goswami - Supreme Court (Photo Credits: PTI)

New Delhi, Nov 11: 2018 నాటి ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామి బాంబే హైకోర్టు బెయిల్ పిటిషన్‌‌ (Arnab Goswami's Bail Plea) తిరస్కరణనూ సుప్రీంకోర్టులొ సవాల్ చేశారు. అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో (CBI) విచారణ చేయించేందుకు ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. ఈ నేపథ్యంలొ సుప్రీంకోర్టు ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విధంగా చేయడం వ్యక్తిగత స్వేచ్చను హరించడం న్యాయాన్ని అపహాస్యం చేయడం కిందికే వస్తుందని సర్వోన్నత ధర్మాసనం (Supreme Court) వ్యాఖ్యానించింది.

అర్నబ్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే (senior lawyer Harish Salve) వాదనలు వినిపిస్తూ.. ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసు దర్యాప్తు చట్ట విరుద్ధంగా సాగుతోందని అన్నారు. తమ కేసు ఎఫ్‌ఐఆర్‌ దశ దాటిపోయిందని, దర్వాప్తు జరిగిన తర్వాతే మే, 2018లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు తెలిపారు. ఇక ఈ కేసు పునర్‌ దర్వాప్తు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారం దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.

డిజైనర్‌ ఆత్మహత్య కేసు, అర్నాబ్ గోస్వామిను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు, పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ మండిపడిన హోం మంత్రి అమిత్ షా, కేంద్ర సమాచార మంత్రి జవదేకర్

ఈ సంధర్భంగా ఈ కేసు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదైనందున అర్నాబ్ గోస్వామిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందా..?’’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలదనీ.. మహారాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకోవద్దని ధర్మాసనం సూచించింది.

ఆయన సిద్ధాంతం ఏదైనా కావచ్చు. నేను కనీసం ఎప్పుడూ ఆయన చానెల్ కూడా చూడలేదు. కానీ ఈ కేసులో రాజ్యాంగ ధర్మాసనం జోక్యం చేసుకోకపోతే మనం నిస్సందేహంగా పతనం దిశగా పోతున్నట్టే. అసలు విషయం ఏమంటే.. మీరు ఈ ఆరోపణల కింద ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను నిరాకరించవచ్చా అనేదే..’’ అని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు.

రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించకుండా ఆర్కిటెక్ట్- ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న ఆరోపణలపై ఈ నెల 4న అర్నాబ్ సహా మరో ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గత బుధవారం అరెస్టై జైలులో ఉన్న అర్నబ్‌కు నవంబర్‌ 18 వరకు రాయిగఢ్‌ జిల్లా కోర్టు జ్యుడిషియల్‌ కస్టడి విధించింది. ఇక మధ్యంతర బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. 2018లో మూసివేసిన ఆత్మహత్య కేసును మళ్లీ తవ్వారనేది అర్నాబ్‌ గోస్వామి వాదనగా వినిపిస్తున్నారు.

ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల బెంచ్ స్పందిస్తూ.. ‘టీవీ చానెల్స్‌ అరుపులను ప్రభుత్వాలు పట్టించుకుంటే ఎలా? రిపబ్లిక్‌ టీవీలో అతని అరుపులపై మీ ఎన్నికల భవిష్యత్‌ ఆధారపడిందా? మేం ఆ టీవీ చూడం.. కానీ, మహారాష్ట్ర సర్కార్‌ చేసింది సరైనదిగా అనిపించడం లేదు. వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి దూస్తే మేమున్నామని గుర్తుంచుకోండి’అని సుప్రీం బెంచ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, సదరు జర్నలిస్టుపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను‌ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మాత్రమే పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement