Chandigarh Shocker: ఆటోడ్రైవర్ కిరాతకం, సేఫ్‌గా దించుతానంటూ నిర్మానుష్య పొదల్లోకి తీసుకువెళ్ళి యువతిపై దారుణంగా అత్యాచారం, ఆపై కొట్టి రోడ్డుపై పడేసిన కామాంధుడు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
తాజాగా చంఢీఘడ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బస్టాప్‌లో దించుతానని చెప్పి నమ్మించి యువతిపై ఆటో డ్రైవర్ తన ఆటోలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు.
Chandigarh, Jan 11: దేశంలో మహిళలపై రోజూ ఏదో మూల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చంఢీఘడ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బస్టాప్‌లో దించుతానని చెప్పి నమ్మించి యువతిపై ఆటో డ్రైవర్ తన ఆటోలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు.
దారుణ ఘటన వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన యువతి తన ఫ్రెండ్ ను కలిసిందుకు చండీగఢ్‌కు వెళ్లింది. అయితే వారు సమాయానికి అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఢిల్లీకి వెళ్లాలనుకుంది. వెంటనే చండీగఢ్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ట్రైన్ అందుబాటులో లేకపోవడంతో బస్ ద్వారా ఢిల్లీకి చేరుకోవాలనుకుంది. దీంతో రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్‌వరకు ఆటోను అద్దెకు తీసుకుంది. అతను చండీగఢ్‌లోని సెక్టార్ 17 ISBT వద్ద దించుతానని తెలిపాడు.
అయితే యువతిపై కన్నేసిన ఆటో డ్రైవర్ ఆమెను బస్టాండ్‌కు తీసుకెళ్లకుండా ఛండీగఢ్ సివిల్ సెక్రటేరియట్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ యువతిపై ఆటోలో అత్యాచారానికి ( raping female passenger in Chandigarh) ఒడిగట్టాడు. అంతేగాక ఆమెపై దాడి చేసి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. అనంతరం బాధితురాలి అరుపులు విన్న సివిల్ సెక్రటేరియట్ నైట్ గార్డ్ 112 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు జైదేవ్ అలియాస్ ఉపేందర్‌ను పోలీసులు అరెస్టు (Auto rickshaw driver arrested ) చేశారు. చండీగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలోని దర్వా ప్రాంతంలో నివసిస్తున్న నిందితుడికి ఇటీవలే వివాహం అయినట్లు పోలీసులు తెలిపారు.