YouTuber Slaps Passenger (Credits: X)

Patna, Mar 3: సోషల్ మీడియాలో (Social Media) ఫేమస్ కావడానికి కొందరు పిచ్చి పనులు చేస్తూ ఇతరులను గాయపరుస్తారు. ఇదీ అలాంటి ఘటనే. వైరల్‌ రీల్‌ కోసం ఒక యూట్యూబర్‌ ప్రయత్నించాడు. కదులుతున్న రైలులోని ప్రయాణికుడి చెంపపై తన ఫ్రెండ్‌ తో కొట్టించాడు. (Man Slap Passenger On Moving Train) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో వారిద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌ లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన రితేష్ కుమార్ వీడియోలు రికార్డ్‌ చేసి యూట్యూబ్‌ లో పోస్ట్‌ చేస్తుంటాడు. ఎక్కువ వ్యూస్‌ వచ్చేందుకు వైరల్‌ వీడియో కోసం అతడు ప్రయత్నించాడు.

మొదలైన ఆస్కార్ అవార్డుల సంబురం.. ఏ క్యాటగిరీలో ఎవరు గెలిచారంటే? (లైవ్ వీడియో)

తగిన శాస్తి

ఈ క్రమంలో అనుగ్రహ నారాయణ్ రోడ్ స్టేషన్‌ లో కదులుతున్న రైలులో విండో వద్ద కూర్చొన్న ప్రయాణికుడి చెంపపై తన ఫ్రెండ్‌ తో కొట్టించాడు. ఈ వీడియోను రికార్డ్‌ చేశాడు. కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా నిందితులను గుర్తించారు. రితేష్ కుమార్, అతడి ఫ్రెండ్‌ ను అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో సంచలన రీల్‌, వ్యూస్‌ కోసం తాను ఇలా చేశానంటూ రితేష్ కుమార్ క్షమాపణలు చెప్పాడు. ఇలాంటి పనులు చేసేవారికి తగిన శాస్తి జరిగిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

బెంగుళూరులో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రెండు BMTC బస్సుల మధ్య ఇరుక్కుపోయిన ఆటో, డ్రైవర్‌తో పాటు ప్రయాణికుడు మృతి