Fungus in Yogurt in Vande Bharat: వందేభారత్ రైలు భోజనం పెరుగులో ఫంగస్, మీ సర్వీస్ ఇంత దారుణమా అంటూ ప్రయాణికుడు ట్వీట్, రైల్వేశాఖ స్పందన ఏంటంటే..
Passenger Shows Fungus-Infested Yoghurt Served On Vande Bharat Express, Railways Responds See Tweets

డెహ్రాడూన్-ఢిల్లీ వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న హర్షద్ అనే ప్రయాణికుడికి ఇచ్చిన భోజనంలో ఫంగస్ వచ్చిన పెరుగును (Passenger Shows Fungus-Infested Yoghurt ) ఇచ్చారు.. దీనితో వందేభారత్ నుంచి ఇలాంటి నాసిరకం సేవలు ఆశించలేదని అసహనం వ్యక్తం చేశాడు. డెహ్రాడూన్‌ నుంచి ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌కు వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో (Vande Bharat Express) ఒక ప్రయాణికుడు తమకు వడ్డించిన పెరుగులో ఫంగస్‌ని గుర్తించి షాక్‌కు గురయ్యాడు. X వినియోగదారు హర్షద్ తోప్కర్ తన ఎగ్జిక్యూటివ్ క్లాస్ భోజనంలో భాగంగా వడ్డించిన పెరుగులో ఫంగస్‌ని చూపించే చిత్రాలను పంచుకున్నారు.  రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్, రైళ్లలో ఫుడ్ డెలివరీ చేయడానికి ఐఆర్‌సీటీసీతో చేతులు కలిపిన స్విగ్గీ

దానిని రైల్వే మంత్రిత్వ శాఖ మరియు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్యాగ్ చేస్తూ ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో డెహ్రాడూన్ నుండి ఆనంద్ విహార్ వరకు వందేభారత్‌లో ప్రయాణిస్తున్నాను. వడ్డించిన పెరుగులో ఆకుపచ్చని పొర చాలావరకు ఫంగస్‌ని గుర్తించింది. వందే భారత్ సేవ నుండి ఇది ఊహించలేదని తెలిపాడు. దీనిపై రైల్వే శాఖ స్పందించింది.

Here's News

ఈ ఘటనపై అధికారులు క్షమాపణలు చెప్పారు. "సార్, మీకు కలిగించిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. ఈ విషయాన్ని వెంటనే ఆన్‌బోర్డ్ సూపర్‌వైజర్‌కి అందించాం, అతను వెంటనే పెరుగును మార్చాడు. ఇంకా, పెరుగు ప్యాక్ గడువు తేదీలోపు ఉంది. సమస్య తయారీదారుతో లేవనెత్తుతోంది," అని IRCTC రాసింది.