కేరళలోని త్రిస్సూర్‌లో మంగళవారం రైలులో నుంచి ప్రయాణికుడు తోసివేయడంతో రైల్వే ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ ( టీటీఈ ) మరణించాడు. మృతుడు, TTE వినోద్ కుమార్‌గా గుర్తించారు. కార్మికుడు అయిన ఒక ప్రయాణికుడు అతన్ని పాట్నా సూపర్ ఫాస్ట్ రైలు S11 కోచ్ నుండి తోసినప్పుడు టీటీఈ మరణించాడు .టీటీఈ వినోద్ తన విధుల్లో భాగంగా రైలులోని ఎస్ 11 బోగీలో ప్రయాణికుల టికెట్లు తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా రజనీకాంత్ అనే ప్రయాణికుడిని టెకెట్ చూపించమని అడిగారు. దీంతో ఇద్దరిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వీడియో ఇదిగో, దాదాపు 1000 బైక్ మోడిఫైడ్ సైలెన్సర్‌లను రోడ్డు రోలర్ కింద వేసి ధ్వంసం చేసిన హైదరాబాద్ పోలీసులు
ఈక్రమంలో ఆగ్రహానికి లోనైనా ఆ ప్రయాణికుడు టీటీఈని రైలులో నుంచి కిందకు తోసేశాడు. దీంతో అవతలి పట్టాలపై పడిపోయిన వినోద్‌ను.. అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీ కొనడంతో మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు పాలక్కాడ్ వద్ద నిందితుడు రజనీకాంత్‌ను పట్టుకున్నారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని అధికారులు తెలిపారు. టీటీఈ వినోద్ ఎర్నాకుళంకు చెందినవారని, ఆయన కొన్ని సినిమాల్లో కూడా నటించారని వెల్లడించారు.ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో విచారణ జరుగుతోంది.