UP Shocker: పెళ్లి మండపంలో ఊడిన వరుడి విగ్గు, బట్టతల బయటపడటంతో వధువు సీరియస్, ఏం జరిగందంటే..?

తెల్లవారుజూమున పెళ్లి అనగా వరుడు కాలు జారి కిందపడ్డాడు. ఆ సమయంలో అతడి తల మీదున్న విగ్గు ఊడిపోయింది. అది చూసి పెళ్లి కూతురు, ఆమె బంధువులు ఖంగుతిన్నారు. తమను మోసం చేసి పెళ్లి చేయాలనుకున్నారని వరుడి కుటుంబసభ్యులతో గొడవకు దిగారు.

Marriage| Representational Image (Photo Credits: unsplash)

లక్నో: మరికొన్ని గంటల్లో పెళ్లనగా.. వధువు తనకు పెళ్లి ఇష్టం లేదని బాంబు పేల్చింది. ఈ ఊహించని ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఉన్నావ్ లో ఓ యువతి, యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి ముందు చేయాల్సిన ఆచారాలన్నీఇరువైపుల వాళ్లు పూర్తిచేశారు. తెల్లవారుజూమున పెళ్లి అనగా వరుడు కాలు జారి కిందపడ్డాడు. ఆ సమయంలో అతడి తల మీదున్న విగ్గు ఊడిపోయింది. అది చూసి పెళ్లి కూతురు, ఆమె బంధువులు ఖంగుతిన్నారు. తమను మోసం చేసి పెళ్లి చేయాలనుకున్నారని వరుడి కుటుంబసభ్యులతో గొడవకు దిగారు.

Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం, ఘటనపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌బాబు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన కాకినాడ ఎఎస్పీ శ్రీనివాస్  

బంధువులు ఎంత నచ్చజెప్పినా వధువు పెళ్లికి ససేమిరా అంది. దాంతో విషయం పోలీస్‎స్టేషన్‌కు చేరింది. అక్కడ పోలీసులు జోక్యం చేసుకొని.. సర్దిచెప్పినా వధువు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దాంతో ఇరుకుటుంబాలు పంచాయతీ నిర్వహించి.. వధువు కుటుంబసభ్యులు పెళ్లికి ఖర్చు చేసిన రూ. 5.60 లక్షలను తిరిగి ఇవ్వడానికి వరుడి కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు.

దాంతో వధువు లేకుండానే వరుడు, బ్యాండుమేళంతో తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ విషయం పెళ్లి కూతురు మేనమామ మాట్లాడుతూ.. బట్టతల ఉన్న విషయాన్ని ఎందుకు దాచిపెట్టారన్నారు. మీరు ముందే చెప్పి ఉంటే, మేం మా అమ్మాయిని మానసికంగా సిద్ధం చేసేవాళ్లం కదా అని అన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement