Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం, ఘటనపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌బాబు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన కాకినాడ ఎఎస్పీ శ్రీనివాస్
YSRCP leader Ananta Babu (Photo-File Image)

Amaravati, May 20: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantha babu) కారులో మృతదేహం కలకలం రేపుతున్నది. ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ బాబు కారులో యువకుడి మృతదేహం బయటపడింది. అతడిని ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రమణ్యంగా ( ex-driver found dead in Kakinada) గుర్తించారు. డ్రైవర్ ను హత్య చేశారంటూ మృతుని కుటుంబ సభ్యులు (family alleges foul play) ఆరోపిస్తున్నారు. అయితే కారులో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతదేహం లభ్యమైన ఘటనపై ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌బాబు వివరణ ఇచ్చారు.

సుబ్రహ్మణ్యం తన దగ్గర ఐదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అయితే.. రెండు నెలల నుంచి సరిగా పనిలోకి రావడం లేదని చెప్పారు. మద్యం అలవాటు ఉండటంతో ద్విచక్రవాహనంపై అనేకసార్లు ప్రమాదానికి గురైనట్లు ఎమ్మెల్సీ తెలిపారు. గత రాత్రి కూడా సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్‌కు గురైనట్టు తెలియడంతో అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. చికిత్స కోసం కాకినాడ అమృత ఆసుపత్రికి తీసుకెళ్లామని, అతని తల్లిదండ్రులు కూడా ఆసుపత్రికి వచ్చారని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. సుబ్రమణ్యం మృతి చెందడంతో మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకువెళతామని చెప్పడంతో కారులో అపార్ట్‌మెంట్‌ వద్దకు పంపించినట్టు వెల్లడించారు.

విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష, బెండపూడి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులతో ముచ్చటించిన ఏపీ ముఖ్యమంత్రి, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడి అబ్బురపరిచిన విద్యార్థులు

నిన్న రాత్రి సుబ్రహ్మణ్యం తన స్నేహితుడు మణికంఠతో కలిసి బయటకు వెళ్ళాడు. రాత్రి 12 గంటల తరువాత సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదానికి గురై అమృత ఆసుపత్రిలో ఉన్నాడని ఎమ్మెల్సీ అనంతబాబు మృతుని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. సుబ్రహ్మణ్యం మృతి చెందాడని అమృత ఆసుపత్రి వైద్యులు నిర్ధారించాక బాడీని తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్ళారు. దీనిపై సర్పవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాకినాడ ఎఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.