CM YS Jagan Review: విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష, బెండపూడి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులతో ముచ్చటించిన ఏపీ ముఖ్యమంత్రి, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడి అబ్బురపరిచిన విద్యార్థులు
CM YS Jagan (Photo-Twitter/AP CMO)

Amaravati, May 19: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై గురువారం (CM YS Jagan Review)చేపట్టారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత‍్యనారాయణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక గురువారం బెండపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు (bendapudi zp high school students) తాడేపల్లికి వెళ్లి.. సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా.. వాళ్లతో సీఎం జగన్‌ (CM Jagan) సంభాషణ దాదాపుగా ఆంగ్లంలోనే కొనసాగింది. వాళ్ల ప్రతిభను మెచ్చుకుని.. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని దీవించారు సీఎం జగన్‌. దేశంలోనే బెస్ట్ సీఎంగా ఏపీ సీఎం జగన్, వరుసగా రెండో సారి అరుదైన ఘనత సాధించిన ఏపీ ముఖ్యమంత్రి, స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ - 2022గా జగన్

కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జిల్లాపరిషత్‌ హైస్కూలు విద్యార్థులు.. విదేశీ శైలి ఆంగ్లంతో అనర్గళంగా మాట్లాడి అందరినీ అబ్బురపరిచారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ తరహాలో ఇంగ్లిష్‌లో మాట్లాడడం సోషల్‌ మీడియాలోనూ విపరీతంగా వైరల్‌ అయ్యింది. ‘ఇంగ్లిష్‌పై బెండపూడి జెండా’ కథనం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వెళ్లింది ఈ విషయం. ఈ నేపథ్యంలో.. ఆయన స్వయంగా రప్పించుకుని ఆ విద్యార్థులతో ముచ్చటించారు. మేఘన అనే స్టూడెంట్‌ తన కిడ్డీ బ్యాంక్‌లోని రూ. 929 సీఎం జగన్‌కు ఇచ్చింది. అయితే మేఘన నుంచి కేవలం రూ.19 మాత్రమే తీసుకుని మిగతా డబ్బును ఆమెకే ఇచ్చారు.

Here's CMO AP Tweets

తాను తెలుగు మీడియం విద్యార్థిని కావడంతోనే.. ఇంగ్లిష్‌పరంగా వాళ్లకు ఇబ్బందులు ఎదురు కాకుండా బోధించానని, తద్వారా విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై పట్టు వచ్చిందని విద్యార్థుల కూడా వచ్చిన ప్రభుత్వ టీచర్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులంతా నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారాయన. గత రెండేళ్లలో సీన్‌ రివర్స్‌​ అయ్యిందని, కార్పొరేట్.. ప్రైవేట్‌ స్కూళ్లలోనూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వీడియోలను ప్రదర్శిస్తుండగా విశేషం అని చెప్పారాయన.