ఏపీ సీఎం జగన్ దేశంలోనే బెస్ట్ సీఎంగా వరుసగా రెండోసారి నిలిచి అరుదైన ఘనత సాధించారు. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో భాగంగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ - 2022 ఫలితాలను వెల్లడించగా… ఈ ఏడాది కూడా ఉత్తమ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలిచారు. విభజన అనంతరం రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ జాబితాలో రెండో బెస్ట్ సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ గెలుపొందారు.
మూడో స్థానంలో ఒడిశా సీఎం, నాలుగో స్థానంలో గుజరాత్ సీఎం ఉన్నారు. మహారాష్ట్ర సీఎం ఐదో స్థానంలో నిలిచారు. బెస్ట్ సీఎంల జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరో స్థానం సాధించారు. ఈ జాబితా ఉత్తరప్రదేశ్ సీఎం ఏడో స్థానంలో, మధ్యప్రదేశ్ సీఎం 8వ స్థానంలో, అసోం సీఎం 9వ స్థానంలో, హిమాచల్‌ప్రదేశ్ సీఎం 10వ స్థానంలో, బీహార్ సీఎం 11వ స్థానంలో, హర్యానా సీఎం 12వ స్థానంలో ఉన్నారు. మరోవైపు సుపరిపాలనలో కూడా ఏపీ టాప్‌లో నిలిచింది. సుపరిపాలన విషయంలో ఏపీ ఒక్కటే టాప్-5లో ఉండగా.. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం ఈ ఘనతను అందుకోలేదు.
The #SKOCH Chief Minister of the Year Award 2022 is conferred upon Hon’ble Chief Minister Y S Jaganmohan Reddy, the second year in a row. He is rebuilding post-division Andhra Pradesh from the ground up, with an emphasis on #RuralDevelopment.
Read here! pic.twitter.com/viTQIyeGBk
— SKOCH Group (@skochgroup) May 17, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)