Kolkata Doctor Case: కోల్ క‌తా డాక్ట‌ర్ హత్యాచారం కేసులో కీల‌క ప‌రిణామం, ఆర్జీ క‌ర్ ఆస్ప‌త్రి మాజీ ప్రిన్సిపాల్ మెడిక‌ల్ రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు

పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (WBMC) గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ (RG Kar’s ex-principal) డాక్టర్‌ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసింది. 31 ఏళ్ల ట్రైనీ లేడీ డాక్టర్‌పై హత్యాచారం కేసుతో పాటు ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనను అరెస్ట్‌ చేసింది

Kolkata Doctor Rape-Murder Case

Kolkata, SEP 19: పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (WBMC) గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ (RG Kar’s ex-principal) డాక్టర్‌ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసింది. 31 ఏళ్ల ట్రైనీ లేడీ డాక్టర్‌పై హత్యాచారం కేసుతో పాటు ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనను అరెస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ కస్టడీలో ఉన్న డాక్టర్‌ సందీప్ ఘోష్‌ను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల జాబితా నుంచి తొలగించినట్లు డబ్ల్యూబీఎంసీ తెలిపింది. బెంగాల్ మెడికల్ యాక్ట్ 1914 నిబంధనల ప్రకారం ఆయన లైసెన్స్ రద్దు చేసినట్లు పేర్కొంది.

Telangana Shocker: హైదరాబాద్‌లో దారుణం, మద్యం మత్తులో ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన వ్యక్తి..షాకింగ్ వీడియో  

కాగా, ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్‌ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (WBMC)ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) గతంలో కోరింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూబీఎంసీ చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 7న ఘోష్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. అయితే ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సందీప్ ఘోష్ ఈ నోటీస్‌కు స్పందించలేదు. ఈ నేపథ్యంలో బెంగాల్ మెడికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం ఆయన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు డబ్ల్యూబీఎంసీ వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement