Bengaluru Horror: 15 మందితో పాడు పని, భర్త వద్దని చెప్పడంతో ప్రియుడి సాయంతో మర్మాంగాన్ని కోసి దారుణంగా చంపేసిన భార్య, కటాకటాల్లోకి నిందితులు

యలహంకలో భార్య ప్రియుని చేతిలో దారుణ హత్యకు (Woman, lover stab husband to death) గురైన నేత కార్మికుని మర్డర్ కేసులు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని భార్యకు చాలామందితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Yelahanka, Oct 28: యలహంకలో భార్య ప్రియుని చేతిలో దారుణ హత్యకు (Woman, lover stab husband to death) గురైన నేత కార్మికుని మర్డర్ కేసులు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని భార్యకు చాలామందితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన యలహంక కొండప్పలేఔట్‌లో మిద్దెపై హత్యకు గురైన సత్యసాయి జిల్లా హిందూపురం వాసి చంద్రశేఖర్‌ (35) కేసులో భార్య శ్వేత, ఆమె ప్రియుడు సురేశ్‌లను పోలీసులు (Yelahanka police) బుధవారం అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

భార్యే.. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడు సురేశ్‌ను పిలిపించి హత్య చేయించినట్లు పోలీసులు విచారణలో తెలిపింది. దీంతో పాటు కీలక విషయాలు కూడా బయటకు వచ్చాయి. బెంగళూరులో ఎంఎస్‌సీ చదివిన శ్వేత కాలేజీలో పలువురు స్నేహితులతో డేటింగ్‌ చేసింది.ఎక్కువ మంది బాయ్‌ ఫ్రెండ్స్‌ కలిగి ఉండడం గొప్ప అనుకుని అలాగే చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు కనీసం 15 మంది బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉండేవారని, కొన్నిరోజులు షికార్లు చేసిన తరువాత వారిని బ్లాక్‌ లిస్టులో పెట్టేదని తెలిసింది.

దారుణం, భర్త మర్మాంగాలను ప్రియుడితో నలిపించి హత్య చేయించిన భార్య, బెంగుళూరులో వివాహేతర సంబంధం మోజులో కిరాతకం, నిందితులను అరెస్ట్ చేసిన యలహంక పోలీసులు

ఇక ఇంటి యజమాని కుమారునితోనూ చనువుగా మెలిగింది. అతనితో బైక్‌పై కాలేజీకి వెళ్లేది.ఈ మధ్యలోనే ప్రియుడు సురేశ్‌తో సంబంధం కొనసాగిస్తోంది.ఈ విషయాలన్నీ భర్త చంద్రశేఖర్‌కు తెలియడంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఇక ప్రియుడు సురేశ్‌తో మాట్లాడానికి కొత్త సిమ్‌కార్డును కొని అందులో భర్తను హత్య చేయడం గురించి మాట్లాడింది.ఇందులో భాగంగా ఈ నెల 22 తేదీన సురేశ్‌ను ఇంటికి పిలిపించింది.

భర్త చంద్రశేఖర్‌ పని నుంచి ఇంటికి రాగానే నీరు రావడం లేదు, పైకి ట్యాంకు వద్దకు వెళ్లి చూడాలని శ్వేత చెప్పింది. అతడు వెళ్లగానే అక్కడ దాగి ఉన్న సురేశ్‌ రాడ్‌తో తలపై కొట్టి, మర్మాంగం కత్తిరించి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తరువాత తనకేమి తెలియనట్లు శ్వేత నాటకమాడింది. భర్త శవంపై పడి వెక్కివెక్కి ఏడ్చింది. ఆమెపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. నిందితురాలు ప్రియుడితో కలిసి ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement