Bihar Shocker: పెళ్లికి నో చెప్పిన లవర్, చివరిగా కలుద్దామని రూంకి రమ్మన్నాడు, రూంలోకి రాగానే స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేసిన ప్రియుడు, నిందితులంతా పరారీలో..

పెళ్లి చేసుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. అయితే ఆ మహిళ అతడితో పెళ్లికి (she refuses to marry him) నిరాకరించింది. ఈ నేపథ్యంలో జూన్‌ 24న కైష్‌, ఆ మహిళను ఒక ప్రాంతానికి పిలిపించాడు. అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ అపస్మారకంగా పడిఉండగా ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Patna, July 18: బీహార్ రాష్ట్రంలో సీతామర్హి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడు తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి (Man rapes woman) పాల్పడ్డాడు. ఒక గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహిళ, 27 ఏళ్ల మొహమ్మద్ కైష్‌ మధ్య పరిచయం ఏర్పడింది. పెళ్ళికి ముందే కొన్ని రోజుల పాటు ఇద్దరూ ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. అయితే ఆ మహిళ అతడితో పెళ్లికి (she refuses to marry him) నిరాకరించింది. ఈ నేపథ్యంలో జూన్‌ 24న కైష్‌, ఆ మహిళను ఒక ప్రాంతానికి పిలిపించాడు. అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ అపస్మారకంగా పడిఉండగా ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు.

రాత్రి పక్కలో పడుకోనివ్వని భార్య, కోపంతో ఆమె తల పగలగొట్టిన భర్త, అనంతరం పోలీసులకు సరెండర్ అయిన నిందితుడు

మరునాడు తెలివిలోకి వచ్చిన తర్వాత బాధితురాలు జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధం కాగా, పంచాయితీ ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని నిందితులు, గ్రామస్తులు నచ్చజెప్పారు. ఆ వ్యక్తితో పెళ్లి జరిపిస్తామని హామీ ఇచ్చారు. అయితే 20 రోజులైనా నిందితులపై గ్రామ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితురాలు ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement