Bikaner-Guwahati Express Derailed: పండగ వేళ ఘోర విషాదం, బెంగాల్‌లో పట్టాలు తప్పిన గౌహతి-బికనీర్ ఎక్స్ ప్రెస్ రైలు, తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య, 10 మంది పరిస్థితి విషమం

పండగ వేళ పశ్చిమబెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జల్పాయ్ గురి జిల్లా మాన్యగురి వద్ద గౌహతి-బికనీర్ ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 12 కోచ్ లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.

Bikaner-Guwahati Express Derailed (Photo-ANI)

పండగ వేళ పశ్చిమబెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జల్పాయ్ గురి జిల్లా మాన్యగురి వద్ద గౌహతి-బికనీర్ ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 12 కోచ్ లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. గాయపడిన 45 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు గాయపడినవారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

గాయపడిన వారిలో 24 మందిని జల్పాయ్ గురి హాస్పిటల్ కు, 16 మందిని మాన్యగురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన బోగీలు ఒకదాన్లోకి మరొకటి చొచ్చుకుపోయినట్టుగా ఉన్నాయి. ఈ బోగీల్లో పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

గ్యాస్ కట్టర్ల సహాయంతో ఈ బోగీలను కట్ చేసి, వాటిలో చిక్కుపోయిన వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ ఉదయం ప్రమాద స్థలికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షించేందుకు వచ్చానని చెప్పారు. మరోవైపు రైల్వే మంత్రితో ప్రధాని మోదీ మాట్లాడారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Advertisement
Share Now
Advertisement