Bengaluru: షాకింగ్ వీడియో ఇదిగో.. తృటిలో కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న సెక్యూరిటీ గార్డ్.. బెంగళూరులో అర్ధరాత్రి అపార్ట్‌మెంట్ గేట్‌ను ఢీకొట్టిన కారు..

బెంగళూరులోని ఒక నివాస అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున ఒక కారు అపార్ట్‌మెంట్ ప్రధాన గేటును వేగంగా ఢీకొట్టడంతో.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.

Security Guard Narrowly Escapes as Car Smashes Into Bengaluru Apartment Gate

Bengaluru: బెంగళూరులోని ఒక నివాస అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున ఒక కారు అపార్ట్‌మెంట్ ప్రధాన గేటును వేగంగా ఢీకొట్టడంతో.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 1:42 గంటలకు జరిగిన ఈ దిగ్భ్రాంతికర ఘటన సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డైంది. ప్రసుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

షాకింగ్ వీడియో ఇదిగో.. బుర్ఖా వేసుకున్న మహిళపై దారుణం.. అక్కడ గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించిన కామాంధుడు, నిందితుడు అరెస్ట్..

ప్రాథమిక వివరాల ప్రకారం.. అపార్ట్‌మెంట్ ప్రవేశ ద్వారం వద్దకు ఒక కారు రాగానే.. లోపలికి అనుమతించేందుకు సెక్యూరిటీ గార్డు గేటు తెరిచేందుకు బయటకు వచ్చాడు. గేటు తెరుచుకుంటుండగానే.. ఆ వాహనం ఊహించని రీతిలో అకస్మాత్తుగా తీవ్ర వేగంతో ముందుకు దూసుకొచ్చి గేటును, ప్రవేశ ద్వార నిర్మాణాన్ని బలంగా ఢీకొట్టింది. సెక్యూరిటీ గార్డు పక్కకు ఎగిరిపడగా, కారు గేటును దాటుకుని అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోకి దూసుకెళ్లి ఆగిపోయింది. కిందపడిన గార్డు వెంటనే తేరుకుని లేచి నిలబడి.. స్వల్ప గాయాలతో అక్కడి నుండి పక్కకు వెళ్లడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

Security Guard Narrowly Escapes as Car Smashes Into Bengaluru Apartment Gate

ఈ సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో అనేకమంది నెటిజన్లు బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ప్రమాదవశాత్తూ ఢీకొట్టాడా? లేక సెక్యూరిటీ గార్డును లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే తొక్కిచేందుకు ప్రయత్నించాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, డ్రైవర్‌కు సంబంధించిన వివరాలను సేకరించి, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నామని బెంగళూరు పోలీసు వర్గాలు తెలిపాయి. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement