NEET-UG Exam Paper Leak Case: నీట్ పరీక్షా పత్రం లీక్ వ్యవహారంలో కీలక ట్విస్ట్, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు
నీట్ యూజీ పేపర్ లీకేజీ వివాదాల నేపథ్యంలో సీబీఐ (CBI FIR on NEET) రంగంలోకి దిగింది. నీట్ నిర్వహణలో అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీట్ వ్యవహారంపై (NEET-UG Exam) విచారణ మొదలుపెట్టిన సీబీఐ (CBI).. బిహార్‌లో జరిగిన పేపర్ లీక్‌తో పాటు గ్రేస్ మార్కుల వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేసింది.
New Delhi, June 23: నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటగా నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రక్షాళనకు ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ఆ తర్వాత ఎన్టీయే డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను పదవి నుంచి తొలగించింది. ప్రస్తుతం ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ITOP) చైర్మన్, ఎండీగా ఉన్న ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఈ క్రమంలోనే నీట్ లీక్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ శనివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. లీక్ మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement
Advertisement