IPL Auction 2025 Live

COVID Vaccine Free to States: మోడీ సర్కారు సంచలన నిర్ణయం, రాష్ట్రాల‌కు ఉచితంగా కరోనా వ్యాక్సిన్, ప్రతిపక్షాల విమర్శలతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం

ఉచితంగానే రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేస్తామ‌ని (COVID Vaccine Free to States) కేంద్ర స‌ర్కారు కీల‌క‌ ప్ర‌క‌ట‌న చేసింది.

Vaccine| Representational Image (Photo credits: Pixabay)

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్యాక్సిన్ల పాల‌సీపై ప‌లు పార్టీల నేత‌లు తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తోన్న నేపథ్యంలో మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఉచితంగానే రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేస్తామ‌ని (COVID Vaccine Free to States) కేంద్ర స‌ర్కారు కీల‌క‌ ప్ర‌క‌ట‌న చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేసే వ్యాక్సిన్ ధ‌ర రూ.150 మాత్ర‌మే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఆ ధ‌ర‌కే కొనుగోలు జ‌రిపి, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఉచితంగా అందిస్తామ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌ స్ప‌ష్టం చేసింది.

కాగా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోన్న ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్‌ కొవిషీల్డ్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలు నిర్ణయించడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్ (Congress leader Jairam Ramesh) తో పాటు ప‌లువురు నేత‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. కేంద్ర స‌ర్కారుకి ఒక డోసును రూ.150కి అమ్మి, రాష్ట్రాలకు మాత్రం రూ.400 విక్రయించడమేంటని వారు ప్రశ్నించారు. ఈ తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. ఉచిత వ్యాక్సిన్‌పై కేంద్ర స‌ర్కారు వెన‌క‌డుగు వేసింద‌ని కాంగ్రెస్ నేత చిదంబ‌రం కూడా నిన్న అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు.

మరో ఘోరం..ఆక్సిజన్ అందక 20 మంది మృతి, ప్రమాదంలో 200 మంది పేషెంట్లు, మరో అరగంట పాటే ఆక్సిజన్‌ నిల్వలు, ఢిల్లీలో విషాద ఘటన

Here's Ministry of Health Tweet

వ్యాక్సిన్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు రూ.400 చెల్లించడం అంటే అమెరికా, యూకే, ఈయూ, సౌదీ, బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా చెల్లించే దానికంటే ఎక్కువ అన్నారు. మేడిన్‌ ఇండియా టీకాకు అత్యధిక ధరనా? అని ప్రశ్నించారు. రూ.150కే విక్రయించినా కంపెనీ లాభాలు పొందుతుందన్నారు. ధరలపై మరోసారి పునరాలోచించాలని కేంద్రానికి సూచించారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. ప్రస్తుతం కొనసాగుతున్న మాదిరిగానే ఉచితంగా సరఫరా చేయనున్నట్లు స్పష్టతనిచ్చింది.